Viral Video: వరుడిని కంటి చూపుతో కంట్రోల్ చేసిన వధువు.. పెళ్లిమండంపంలో కూడా తగ్గనేలేదు కదా..

ABN , First Publish Date - 2022-02-17T22:39:38+05:30 IST

ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అతిథులతో ఓ వివాహ కార్యక్రమం సందడిగా ఉంటుంది. తాళి కట్టే ఘట్టం ముగిశాక.. అతిథులంతా భోజనం చేసేందుకు సిద్ధమవుతారు. ఈ సమయంలో వధూవరులు ఇద్దరూ భోజనం చేసేందుకు..

Viral Video: వరుడిని కంటి చూపుతో కంట్రోల్ చేసిన వధువు.. పెళ్లిమండంపంలో కూడా తగ్గనేలేదు కదా..

ఏ విషయంలోనైనా తమ మాటే నెగ్గాలనే విషయంలో కొందరు భార్యాభర్తల మధ్య అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కొంతవరకు మాత్రమే పరిమితమైతే బాగుంటుంది కానీ.. సమస్యలను పెద్దవి చేసుకుంటే చివరకు దాంపత్య జీవితమే సర్వనాశనం అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే.. పెళ్లి సమయంలో వధూవరుల మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి వారికి జీవితాంతం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంటాయి. అలాంటి సరదా సంఘటనే ఇప్పుడు మనం చూడబోయే వివాహ కార్యక్రమంలో చోటు చేసుకుంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అతిథులతో ఓ వివాహ కార్యక్రమం సందడిగా ఉంటుంది. తాళి కట్టే ఘట్టం ముగిశాక.. అతిథులంతా భోజనం చేసేందుకు సిద్ధమవుతారు. ఈ సమయంలో వధూవరులు ఇద్దరూ భోజనం చేసేందుకు కూర్చుని ఉంటారు. ఇద్దరి విస్తరిలో వివిధ ఆహార పదార్థాలను వడ్డిస్తారు. భోజనం చేసే సమయంలో వధువుకు తెలీకుండా ఆమె ప్లేట్‌లోని పూరీని వరుడు తీసుకుంటాడు. వెంటనే అప్రమత్తమైన వధువు.. ఒకే ఒక్క రొమాంటిక్ లుక్ ఇస్తుంది.

వివాహానికి గిఫ్ట్‌‌తో రావాల్సిన మహిళ.. గన్‌తో ఎంట్రీ.. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని అంతా..


దీంతో వరుడు వెంటనే ఆ పూరీని వధువు ప్లేట్‌లో పెడతాడు. దీంతో ఆమె చిరునవ్వుతో ‘‘ ఇలాంటి వేషాలే వద్దనేది’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియోలో వధువు ఇచ్చిన రొమాంటిక్ లుక్... చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వరుడిని పెళ్లి మండపం నుంచే కంట్రోల్‌ చేస్తోందంటూ.. మరికొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ దంపతులు సామాన్యులు కారు.. రాత్రయిందంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వీరు చేసే పనులు ఏంటో తెలుసా..





Updated Date - 2022-02-17T22:39:38+05:30 IST