వైరల్ అవుతున్న శుభలేఖ.. ఆదర్శనీయంగా జరుగుతున్న ఈ వివాహం గురించి తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-04-12T22:02:31+05:30 IST

సాధారణంగా పెళ్లి అంటే భారీ కల్యాణ మండపం, విందు భోజనాలు, ఊరేగింపులు ఉంటాయి.

వైరల్ అవుతున్న శుభలేఖ.. ఆదర్శనీయంగా జరుగుతున్న ఈ వివాహం గురించి తెలిస్తే..!

సాధారణంగా పెళ్లి అంటే భారీ కల్యాణ మండపం, విందు భోజనాలు, ఊరేగింపులు ఉంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీకి చెందిన ఓ యువకుడు తన వివాహ వేడుకను అత్యంత ఆదర్శనీయంగా తీర్చిదిద్దాడు. చందౌలీ నగర్ పంచాయితీలోని గౌతమ్ నగర్ నివాసి అజిత్ కుమార్ వివాహం ఈ నె 21న జరుగబోతోంది. చిన్నప్పటి నుంచి సామాజిక సేవ అంటే ఇష్టం పెంచుకున్న అజిత్ తన వివాహాన్ని కూడా అదే పద్ధతిలో చేసుకోబోతున్నాడు. 


తన పెళ్లి రోజు రాత్రి 11 గంటలకు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో వరుడు, వధువు కూడా రక్తదానం చేయనున్నారు. అనంతరం 12 గంటలకు పేద, అనాథ పిల్లలకు అన్నదానం చేయనున్నాడు. అంతకు ముందు సాయంత్రం ఆరు గంటలకు వృద్ధాశ్రమంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఊరేగింపుగా కల్యాణ మండపానికి వెళ్లనున్నాడు. ఈ ఆదర్శ వివాహ వేడుక గురించి చౌందౌలీలో జోరుగా చర్చ జరుగుతోంది. అజిత్ ఆలోచనను ప్రజలు అభినందిస్తున్నారు. సామాజిక కార్యకర్త అయిన అజిత్ వివాహ సమయంలో కూడా తన నైతిక బాధ్యతను మరచిపోలేదు.


రక్తదానంలో అజిత్ ఎప్పుడూ ముందుండేవాడు. ఇప్పటివరకు ఎన్నోసార్లు రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాడు. ఇక, కరోనా సమయంలో కీలకంగా వ్యవహరించి వలస కూలీలకు ఆహారం అందించాడు. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ అజిత్ ముందుంటాడు. తన పెళ్లి కార్డుపై కూడా సేవ్ ట్రీ, సేవ్ లైఫ్ అనే సందేశాన్ని రాయించాడు. కాగా, తన పెళ్లి రోజు జరిగే కార్యక్రమాల గురించి అజిత్ తన శుభలేఖలో పేర్కొన్నాడు.  

Updated Date - 2022-04-12T22:02:31+05:30 IST