Abn logo
Oct 27 2021 @ 21:17PM

ఒంటిరిగా వెళ్తున్న యువతి.. వెనుకనుంచి వెంబడించిన బాలుడు.. అదునుచూసి లోబరుచుకునేందుకు యత్నం.. చివరికి..

నేటి సమాజంలో టెక్నాలజీ ఎంత పెరిగిపోతోందో.. అంతే వేగంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. చిన్న పిల్లల్లోనూ నేర స్వభావం పెరిగిపోతోంది. కొందరైతే అశ్లీల వీడియోలకు అడిక్ట్ అవుతూ అత్యాచారాలకు తెగబడుతున్నారు. వీరి కారణంగా బాలికలు, యువతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేరళలో పదో  తరగతి చదువుతున్న ఓ బాలుడు చేసిన పని సంచలనం కలిగించింది. ఒంటరిగా వెళ్తున్న యువతిని టార్గెట్ చేసిన అతను.. చివరకు ఏం చేశాడంటే...

కేరళలోని కొండొట్టి సమీప ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నారు. క్రీడల్లోనూ ఇతనికి మంచి పట్టు ఉంది. గతంలో రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే ఈ క్రమంలో అతడికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో గానీ.. అశ్లీల వీడియోలు చూడడం మొదలెట్టాడు. సోమవారం అర్ధరాత్రి ఓ యువతి ఒంటరిగా నడిచి వెళ్లడాన్ని గమనించాడు. ఎలాగైనా అత్యాచారం చేయాలని భావించాడు.

ఆమెను కొద్ది దూరం వెనుక నంచి వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లగానే వెనుక నుంచి బలవంతంగా పట్టుకుని.. సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో బాలుడు తనపై రాళ్లతో దాడి చేశాడు. చివరికి ఎలాగోలా అతడి నంచి తప్పించుకున్న యువతి.. కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...