జోలాపుట్టు గేట్లు మూసివేత

ABN , First Publish Date - 2022-05-17T06:22:00+05:30 IST

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన జలాశయం గేట్లను సోమవారం మూసివేసి, నీటి సరఫరాను నిలిపివేశారు.

జోలాపుట్టు గేట్లు మూసివేత
జోలాపుట్టు ప్రధాన జలాశయం గేట్ల మూసివేత

16ఎంపీటీ4: 


మాచ్‌ఖండ్‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో నీటి సరఫరా నిలిపివేత


ముంచంగిపుట్టు, మే 16: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన జలాశయం గేట్లను సోమవారం మూసివేసి, నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఈఈ (జనరేషన్‌) రమణయ్య మాట్లాడుతూ మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం ఆధునికీకరణ పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటిగా జోలాపుట్టు జలాశయం నుంచి దిగువ ప్రాంతంలో ఉన్న డుడుమకు నీటి సరఫరాను నిలిపివేశామన్నారు. సోమవారం రాత్రికి డుడుమ డైవర్షన్‌ డ్యామ్‌ నుంచి విద్యుత్‌ కేంద్రానికి సరఫరా చేస్తున్న నీటిని సైతం నిలిపి వేస్తామని ఆయన పేర్కొన్నారు. మూడు రోజులపాటు ఆయా జలాశయాల నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఆయన చెప్పారు. మూడు రోజుల పాటు విద్యుత్‌ ఉత్పత్తి సైతం తాత్కాలికంగా ఆగుతుందని వెల్లడించారు.

Updated Date - 2022-05-17T06:22:00+05:30 IST