Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

సత్యవేడు, నవంబరు 28: విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన వరదయ్యపాలెం మండలం నెల్లటూరులో ఆదివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు....గ్రామానికి చెందిన గుమ్మడి రమేష్‌ ఇంటి గోడలు వర్షానికి తడిచి ఉండడంతో గోడలకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. ఈ క్రమంలో రమేష్‌ కుమారుడు కిషోర్‌ (17) గోడలను ముట్టుకోవడంతో షాక్‌ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా కిషోర్‌ వరదయ్యపాళెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. బాలుడి మృతితో నెల్లటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.


Advertisement
Advertisement