విజృంభిస్తున్న కరోనా ?

ABN , First Publish Date - 2022-01-20T04:45:36+05:30 IST

రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమం లో విషజ్వరాలు కూడా అధికమవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణంలో ఉన్న ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. వచ్చిన జ్వరం కరోనా, లేక విషజ్వరమా అనే వి షయంలో సందిగ్ధావస్థలో ప్రజ లు కొట్టుమిట్టాడుతున్నారు.

విజృంభిస్తున్న కరోనా ?
రద్దీగా ఉన్న బద్వేలు నాలుగు రోడ్ల కూడలి

తీవ్ర స్థాయిలో విషజ్వరాలు

పోరుమామిళ్లలో ఆరుగురు వైద్య సిబ్బందికి పాజిటివ్‌

బద్వేలు రూరల్‌, జనవరి 19: రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమం లో విషజ్వరాలు కూడా అధికమవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణంలో ఉన్న ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. వచ్చిన జ్వరం కరోనా, లేక విషజ్వరమా అనే వి షయంలో సందిగ్ధావస్థలో ప్రజ లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు కరోనా భారిన పడడం ఆందోళన కరంగా తయారైంది. వివరాల్లోకెళితే....

 కరోనా మొదటి దశలో లాక్‌డౌన్‌తో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులున్నా నాటి పరిస్థితుల కారణంగా తీవ్రతరం కాలేదు. రెండో దశలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రజలు కరోనా భారిన పడడం, మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవడం పాఠకులకు విదితమే. ఇంత జరిగినా మూడో దశలో కరోనా పట్ల ప్రజల కు అవగాహన పెరిగిన దాఖలాలు మచ్చుకై నా కనబడడంలేదు. నేటి కరోనా కేసులు పెరుగుదలనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవ చ్చు. సంక్రాంతి సమయంలో వస్త్ర, బంగారు, కిరాణా దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అప్పటికే కరోనా మూడో ద శ దేశంలోకి ప్రవేశించిందని, పెద్ద పెద్ద నగరాల్లో కేసులు ఎక్కువ అవుతున్నాయని ప్రజ లు అప్రమత్తంగా ఉండాలంటూ పత్రికల్లో న్యూస్‌ ఛానళ్లలో ప్రత్యేక కథనాలు వెలువడు తున్నా ప్రజలు ఏ మాత్రం లెక్కచేయడం లేదని చెప్పవచ్చు.

నేటికీ మాస్కులు ధరించే వారి సంఖ్య 50 శాతమైనా దాటలేదంటే ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెరిగిందా, లేక తగ్గిందనా అన్న సంశయం కలుగుతోం ది. ఇటీవల పోలీసుశాఖ కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలు మాస్కు లు ధరించాలని పట్టణమంతా ఆటో ద్వారా ప్రచారం చేసినా ప్ర జలు పెడచెవినపెట్టినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు నిబంధనలను  పాటించకుంటే భారీ మూల్యం చెల్లించాల్సివస్తుందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. 

 ఆరుగురు వైద్యసిబ్బందికి కరోనా 

పోరుమామిళ్ల, జనవరి 19: వైద్యవిధాన పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. పోరుమామిళ్ల వైద్యవిధాన పరిషత్‌లో 53 మంది సిబ్బందిలో 16 మందిని పరీక్షించగా ఆరుగు రికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని డాక్టర్‌ ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.

ప్రజలు అప్రమత్తమవ్వాలి

 కరోనా మూడో దశలో ప్రజలు అప్రమత్తమవాలి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్‌తో చేతులు తరుచూ శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, గొంతు నొప్పి, జలుబు, జ్వ రం, ఒంటి నొప్పులు లక్షణాలున్న వారు తప్పక ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను చేయించుకోవాలి. సొంత వైద్యం ప్రమాదకరం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విరివిగా టెస్టులు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ అయిన వారు హోం ఐసొలేషన్‌లో ఉంటామంటే కిట్‌ను అందజేస్తు న్నాం. తీవ్రతరమైన వారిని కడపకు తరలిస్తున్నాం. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. 

- డాక్టర్‌ చంద్రహా్‌సరెడ్డి, తొట్టిగారిపల్లె ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి 

నిబంధనలు తప్పక పాటించాలి : ఎస్‌ఐ 

పోరుమామిళ్ల, జనవరి 19: క ర్ఫ్యూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోరుమామిళ్ల ఎస్‌ఐ హరిప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం సా యంత్రం ఆర్టీ సీ బస్టాండ్‌ వద్ద కరోనాను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించా రు. మాస్కులు ధరించని వారికి జరిమానా తప్పదన్నారు. వ్యాపారు ల వద్దకు వచ్చే వారు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని షాపు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  



Updated Date - 2022-01-20T04:45:36+05:30 IST