విజృంభిస్తున్న కరోనా..!

ABN , First Publish Date - 2020-07-05T11:57:32+05:30 IST

విజృంభిస్తున్న కరోనా..!

విజృంభిస్తున్న కరోనా..!

గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు

 క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న అధికారులు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీ స్థాయిలోనేనమోదవుతున్నాయి.

రోజురోజుకూ కేసులు బయటపడుతుండడంతో అధికారులు వారిని కొవిడ్‌ సుపత్రులకు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.

పాజిటివ్‌ నమోదైన గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

 నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో


పాతపట్నం, జూలై 4: కరోనా నియంత్రణలో భాగంగా కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నామని, వీటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని పాలకొండ ఆర్డీవో టీవీఎన్‌జీ కుమార్‌ హెచ్చరించారు.  కంటోన్మెంట్‌జోన్‌ పరిధిలోని గ్రా మాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ఎం. కాళీ ప్రసాద్‌ మండల పరిస్థితిని వివరించారు. శనివారం రెండు గ్రామాల్లో 12 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారిలో నలుగురిని రాగోలు జెమ్స్‌కు, 8 మందిని సంతబొమ్మాళి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించామన్నారు. వీటిలో ఇటీవల పరీక్షలు నిర్వహించగా 10 పాజిటివ్‌గా తేలగా 2 కేసులు కొత్తగా గుర్తించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజారోగ్య భద్రత కోసం నిబంధనలు అమలు చేస్తున్నామని, వీటిని పాటించాలన్నారు.

 

సంతకవిటిలో 20 మందికి..

సంతకవిటి: మండల కేంద్రంలో శనివారం 20 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు తహసీల్దార్‌ ఈశ్వరమ్మ తెలిపారు. మండల కేంద్రంలో 11, మరో మూడు గ్రామాల్లో 9 కేసులు నమోదయ్యాయన్నా రు. ఆర్‌ఎంపీ ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారితో కాంటాక్టులో ఉన్న వారు ఆం దోళన చెందుతున్నారు. వీరందరినీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామన్నారు. సంతకవిటిని రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు పాలకొండ ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మండలస్థాయి అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.


మండలంలో ఒకేరోజు  21 

మండలంలో ఒకే రోజు 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పోలాకి పీహెచ్‌సీ పరిధిలో 19 కేసులు నమోదైనట్టు వైద్యాధికారి బండారు అప్పలనాయుడు తెలిపారు. ఇటీవల పలాసలో జరిగిన ఓ వేడుకకు వెళ్లిన అనుమానితులందరి రక్తపూతలు సేకరించి పంపగా 19 మందికి పాజిటివ్‌గా నమోదైనట్టు ఆయన చెప్పారు. గుప్పెడుపేట పీహెచ్‌సీ పరిధిలో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి శిమ్మఇందుసింహా తెలిపారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయాల్సి వస్తోందని ఎస్‌ఐ చిన్నంనాయుడు తెలిపారు. 


 40 మంది తరలింపు

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని ఒక కాలనీలో రక్తనమూనాలు సేకరించగా వారిలో 40 మందికి పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో వారిని రాగోలు జెమ్స్‌, సంతబొమ్మాళి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించినట్లు  మండల ప్రత్యేకాధికారి కె.రామారావు తెలిపారు. గ్రామంలోని వీధుల్లోకి ఇళ్ల నుంచి బయటకు రాకుం డా పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఒకరికి కరోనా గుర్తించి క్వారంటైన్‌కు తరలించామన్నారు.  ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, తదితరులున్నారు.


మండలంలో నలుగురికి...

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి మండలంలోని రెండు గ్రామాల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బోరుభద్ర పీహెచ్‌సీ వైద్యాధికారి గోపీకృష్ణ తెలిపారు. వీరు ఇటీవల ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి వచ్చారన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో కంటైన్మెంట్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. 


మండలంలో ఒకరికి..

మండలంలోని ఓ గ్రామంలో ఒకరికి కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లు తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ప్రాథమిక  టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిం దన్నారు. దీంతో శనివారం ఆ ప్రాంతంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి ఆనందరావు,  నేతృత్వంలో బ్లీచింగ్‌ చల్లి ద్రావణం పిచికారీ చేశారు.


కంటైన్మెంట్‌ జోన్‌గా..

రాజాం: రాజాం పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫైర్‌ స్టేషన్‌ సమీపంలో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. శనివారం మండల ప్రత్యేకాధికారి ఎం.జగన్నాథం, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, తహసీల్దార్‌ పి.వేణుగోపాలరావు తదితరులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి రాకపోకలను నిషేధిస్తూ బారికేడ్లను ఏర్పాటు చేయించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్నవారందరికీ సామాజిక ఆసుపత్రిలో కరోనా నిర్ధారణకు శ్యాంపిళ్లను తీసుకుని హోం క్వారంటైన్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు.


మండలంలో ఒకరికి...

సారవకోట: మండలంలో ఒక గ్రామంలో ఒకరికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని తహసీల్దారు బి.రాజమోహన్‌ తెలిపారు. గత నెలలో హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. మార్గమధ్యంలో పైడి భీమవరం వద్ద కరోనా పరీక్షలు చేయించుకోగా ఈ పరీక్షల్లో పాజిటివ్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయని, మరో పర్యాయం పరీక్షల నిమిత్తం కాకినాడ ల్యాబ్‌కు నమూనాలు పంపిస్తున్నామన్నారు. ఈతడిని రాగులో కోవిడ్‌ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.  


మందస మండలంలో ఆరుగురికి...

హరిపురం: మందస మండలంలో ఓ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న  ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారని డీటీ అమర్‌నాఽథ్‌  ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో  శనివారం ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలను వైద్యులు సంపత్‌కుమార్‌, రవికుమార్‌దొర ఆధ్వర్యంలో నిర్వహించి  75 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపించారు. 


 ఆమదాలవలసలో ఒకరికి...

పట్టణంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ గుర్తించినట్లు కమిషనర్‌ ఎం.రవి సుధాకర్‌ తెలిపారు. ఇటీవల భార్యభర్తలు హైదరాబాద్‌ నుంచి  రావడంతో శాంపిళ్లు సేకరించగా, పాజిటివ్‌ నివేదిక వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు   కొవిడ్‌ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఆ ప్రాంతంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.


సోంపేట మండలంలో..

సోంపేట: మండలంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించడంతో  విశాఖ తరలించినట్లు తహసీల్దార్‌ ఎస్‌.గురుప్రసాద్‌ తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో శనివారం పారి శుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఆయనతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిం చేందుకు  చర్యలు చేపట్టారు. ఇక్కడ కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటుచేశారు.


 పాలకొండలో ఒకరికి...

పాలకొండ: పాలకొండ  నగరపంచాయతీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారించినట్లు ఆర్డీవో టీవీఎస్‌జీ కమార్‌, కమిషనర్‌ శివప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. వీరఘట్టం మండ లంలోని ఓ  గ్రామంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ ఎం.గణపతి తెలిపారు.


 భామిని మండలంలో... 

భామిని: మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తహసీల్దార్‌ నర్సింహమూర్తి తెలిపారు.  ఇతడు తలసీమియా వ్యాధిగ్రస్తుడు కావడంతో ఇటీవల రిమ్స్‌కు రక్తం ఎక్కించు కునేందుకు వెళ్లాడని చెప్పారు. అక్కడ ట్రూనాట్‌ పరీక్షలు చేయడంతో శుక్ర వారం పాజిటివ్‌గా తేలిందన్నారు.  ఆయన గురించి ఆరా తీయగా శ్రీకాకుళం నుంచి బత్తిలి బస్సులో స్వగ్రామానికి వస్తున్నట్లు గుర్తించామని, జేసీ ఆదేశాల మేరకు కొవిడ్‌ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులో సిబ్బంది,  ప్రయాణికులను కోటబొమ్మాళి క్వారంటైన్‌కు తరలించాలని పేర్కొన్నారన్నారు.

Updated Date - 2020-07-05T11:57:32+05:30 IST