అరచేతిలో పుస్తక ప్రపంచం

ABN , First Publish Date - 2022-04-25T05:06:38+05:30 IST

రాష్ట్రంలో భారీస్థా యిలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడు నున్న నేపథ్యంలో అభ్యర్థులు గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాల బాటపట్టారు. మరికొందరు ఇంటి వద్దే సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తుండడంతో ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుంది.

అరచేతిలో పుస్తక ప్రపంచం

- స్మార్ట్‌ ఫోన్‌ రాకతో మారిన పరిస్థితులు

- అరచేతిలో ఈ లైబ్రరీ

- ఎక్కడ కూర్చొనైనా చదువుకునే వెసులుబాటు

- ఏ పుస్తకమైన క్షణాల్లో ప్రత్యక్షం

- ఉద్యోగార్థులకు సదావకాశం

వాంకిడి, ఏప్రిల్‌ 24: రాష్ట్రంలో భారీస్థా యిలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడు నున్న నేపథ్యంలో అభ్యర్థులు గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాల బాటపట్టారు. మరికొందరు ఇంటి వద్దే సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తుండడంతో ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల నిరుద్యోగులకు అవసర మైనన్ని పుస్తకాలు లభించ ట్లేదు. ఒకరి తర్వాత మరొ కరు చదువుకోవడానికి నిరీక్షి స్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఉన్న పుస్తకాలు ప్రత్యామ్నాయం కానున్నా యి. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ, ఇతర వెబ్‌సైట్లలో పుస్తకాలు ఉండగా మరికొన్ని వెబ్‌సైట్లలోవీడియో పాఠాలు కూడా పుష్కలంగా ఉన్నా యి. ప్రామాణి కమైన దాన్ని ఎంచుకొని ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని క్రమం తప్పకుండా వాటినే అనుస రిస్తే తడబాటుకు ఆస్కార ముండదు. ఆయా వెట్‌సైట్లు సందేహాల నివృత్తికి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. 

అన్ని భాషల్లో..

 దేశంలో గుర్తించిన అన్ని ప్రధాన భాషల్లో కలిపి నాలుగు కోట్లకు పైగా పుస్తకాలు ఉన్నా యి. కొన్ని ఆడియోలు సైతం పొందుపరిచారు. చదువుకోవడంతో పాటు అవసరమైన సమాచా రాన్ని పేజీలను పీడీఎఫ్‌ ఫైల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లోని ప్లేస్టోర్‌లోకి వెళ్లి  నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు.

పాఠ్యపుస్తకాలు

ప్రతి పోటీపరీక్షకు దాదాపు 4-10వ తరగ తుల పాఠ్యపుస్తకాల సమాచారం ప్రాథమిక అవగాహనకు ఉపయోగపడుతుంది. కేంద్ర సిలబస్‌కు సంబంధించినవి(ఎన్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర సిలబస్‌కు (ఎస్‌సీఈఆర్‌టీ తెలంగాణ)లో ఈ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని నేరుగా చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. వీటికి ఎలాంటి రుసుములు, రిజిస్ట్రేషన్లు అవసరంలేదు. 

రుసుము చెల్లించి..

సివిల్స్‌, జేఈఈ, నీట్‌ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్న ప్రైవేటు సంస్థలు టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించిన సిల బస్‌ పైనా తర్ఫీదునివ్వడానికి సిద్ధమయ్యాయి. ఆయా సంస్థలు స్వల్ప, దీర్ఘకాల శిక్షణకు నిర్దే శించిన రుసుము చెల్లించి నమోదైతే ఆన్‌లైన్‌ వీడియో పాఠాలు నమూనా పరీక్షలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆన్‌అకాడమీ, గ్రూప్స్‌ అడ్డా, అడ్డా 24/7, మన విద్య, ఆన్‌లైన్‌ ఐకేఎస్‌, స్మార్ట్‌ ప్రిపరేషన్‌, కౌటిల్య వంటి సం స్థలు కొంత రుసుముతో ఆన్‌లైన్‌ బోధన, పాఠ్య సామగ్రిని అందిస్తున్నాయి. వీటిలో చేరే ముందు స్పష్టమైన అవగాహన ఏర్పచ్చు కోవాలి. 

దూరవిద్య పాఠాలు

అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని ఆయా కోర్సులకు నిపుణులు బోధించిన వీడి యోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ, పీజీలో చరిత్ర, రాజనీతిశాస్త్రం, బీఈడీ, ఆంగ్లం, తెలుగుపై వీడియోలు ఉన్నా యి. పోటీ పరీక్షల సిలబస్‌కు సంబంధించిన వీడియో పాఠాలతో ప్రయోజనం చేకురుతుంది. మరోవైపు టీ-శాట్‌ ఇటీవల ఆన్‌లైన్‌బోధన ప్రారంభించింది. 

సభ్యత్వం తీసుకుంటే సరి

 నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో తొలుత సభ్యత్వం తీసు కోవాలి. ుఽ్చ్టజీౌుఽ్చజూ జూజీఛట్చటడ .జౌఠ్టి.జీుఽ ఇన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. పేరు, పుట్టిన తేది, పట్టణం/గ్రామం మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, చదువుతున్న విద్యా సంస్థ పేరు నమోదు  చేయాలి. చదువు పూర్తయిన వారు జిల్లా గ్రంథాలయం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. అనంతరం మెయిల్‌ ఐడీతో లాగినై కోరుకున్న పుస్తకాలు చదువుకోవచ్చు.  

సద్వినియోగం చేసుకోవాలి

వడ్లూరి రాజేష్‌- ఉపాధ్యాయుడు

ఉద్యోగార్థులు లైబ్రరీలలో, ఇతర బుక్‌ స్టాల్‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలతో పాటు   నేషనల్‌ డిజిటిల్‌ లైబ్రరీ, మరి కొన్ని వెబ్‌సైట్‌లలో ఉన్న పుస్తకాలను సద్వియోగం చేసుకోవాలి. ప్రస్తుతం పోటీ పెరిగిపోవ డంతో లైబ్రరీల్లోను పుస్తకాలు సకాలంలో దొరకడం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్లలో పుస్తకాలు డౌన్‌లోడ్‌ చేసుకొని చదువుకోవడంవల్ల మేలు జరుగుతుంది. 

Updated Date - 2022-04-25T05:06:38+05:30 IST