గుర్తుతెలియని మహిళ శవం ఆచూకీ లభ్యం

ABN , First Publish Date - 2022-08-11T05:50:37+05:30 IST

మండలంలోని కాగానిపల్లి సమీప ముళ్ల పొదల్లో సోమవారం లభ్యమైన గుర్తుతెలియని మహిళ శవం ఆచూకీ ల భ్యమైంది. సింగిరెడ్డిపల్లికి చెందిన వడ్డె మంజుల(35)గా తల్లిదండ్రులు గుర్తించి అంగీకరించా రు.

గుర్తుతెలియని మహిళ శవం ఆచూకీ లభ్యం
మంజుల (ఫైల్‌)

గోరంట్ల, ఆగస్టు 10: మండలంలోని కాగానిపల్లి సమీప ముళ్ల పొదల్లో సోమవారం లభ్యమైన గుర్తుతెలియని మహిళ శవం ఆచూకీ ల భ్యమైంది. సింగిరెడ్డిపల్లికి చెందిన వడ్డె మంజుల(35)గా తల్లిదండ్రులు గుర్తించి అంగీకరించా రు. బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, వెంకటరామప్ప తెలిపిన వివరాలివి. సింగిరెడ్డిపల్లికి చెందిన మంజుళకు రొద్దం మండలం కందూకర్లపల్లికి చెందిన వ డ్డె రమే్‌షతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు కాగా, ఒ కరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పెద్దకుమారుడు సాయిచరణ్‌ గోరంట్ల బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. 14ఏళ్ల క్రితం భర్తతో విభేదించి కుమారుడితో కలిసి మంజుల పుట్టింటిలో ఉంటోంది. నాలుగేళ్ల క్రితం గంగాదేవిపల్లికి చెందిన వడ్డె నాగరాజుతో పరిచయం ఏర్పడి, సహజీవనం కొనసాగించింది. కాగా మంజుల ప్రైవేట్‌ పరిశ్రమలో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి గోరంట్లలోని శివాలయం వీధిలో కొంతకాలంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కష్టపడి పనిచేసిన డబ్బును ప్రియుడు వడ్డె నాగరాజు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో నాలు గు నెలల క్రితం వారి మధ్య మనస్ఫర్థలు ఏర్పడి దూరంగా ఉం చింది. నెలరోజుల క్రితం ప్రియుడు ఆమె వెంట పడి తిరుగుతు న్నా మంజుల పట్టించుకోలేదు. తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో మంజుల 20 రోజుల క్రితం  బెంగళూరు వెళ్తున్నానని తల్లిదండ్రులతో చెప్పి ద్విచక్రవాహనంలో ప్రియుడితో వెళ్లింది. దూరంగా ఉంచినందుకు ఆమెపై కక్ష పెంచుకున్న ప్రియుడే హతమార్చి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తంచేశారు. మృతురాలి సోదరుడు వడ్డె శ్రీనివాసులు ఇదే విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడును వివరణ కోరగా, లభ్యమైన మృతదేహం వడ్డె మంజుల దిగా గుర్తించామన్నారు. ఘటనకు కారణాలను దర్యాప్తు చేసి  వెలికి తీస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-11T05:50:37+05:30 IST