క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న 108 సిబ్బంది
ఇరువురికఇ గాయాలు
సీఎ్‌సపురం, డిసెంబరు 3 : కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పిల్లిపల్లి గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన వెంకట రమణయ్య, అంకయ్యలు ద్విచక్ర వాహనంపై సిద్ధేశ్వరం వెళుతుండగా పిల్లిపల్లి గ్రామానికి వచ్చే సరికి ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రవద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు.