అతి పెద్ద మ్యూజియం!

ABN , First Publish Date - 2022-06-14T06:01:06+05:30 IST

ప్రస్తుతం ఈ మ్యూజియంలో ఎనభై లక్షలకు పైగా వస్తువులు ఉన్నాయని అంచనా. అయితే కొన్ని వస్తువులను మాత్రమే సందర్శకులు చూడటానికి అనుమతిస్తారు.

అతి పెద్ద మ్యూజియం!

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఎక్కడుందో తెలుసా? లండన్‌లో ఉంది. లండన్‌లో ఉన్న బ్రిటిష్‌ మ్యూజియానికి అతిపెద్ద మ్యూజియంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది అతి పురాతనమైన మ్యూజియం కూడా! 

ప్రస్తుతం ఈ మ్యూజియంలో ఎనభై లక్షలకు పైగా వస్తువులు ఉన్నాయని అంచనా. అయితే కొన్ని వస్తువులను మాత్రమే సందర్శకులు చూడటానికి అనుమతిస్తారు. మ్యూజియం సందర్శనకు ఎలాంటి రుసుములు వసూలు చేయరు. ఎవరైనా ఉచితంగా సందర్శించవచ్చు.

ఈ మ్యూజియంలో ఎంతో విలువైన పురాతన వస్తువులు ఉన్నాయి. ఆసియా చరిత్రను కళ్లముందుంచే వస్తువులు కూడా ఇక్కడ వేలల్లో ఉన్నాయి. యూరోపియన్‌ల చరిత్ర, ఈజిప్టుల చరిత్రను కళ్లముందుంచే వస్తువులు, పుస్తకాలు ఉన్నాయి. 

ప్రపంచంలోనే అద్భుతమైనవిగా పిలిచే చిత్రాలను ఈ మ్యూజియంలో చూడొచ్చు. లియోనార్డో డావిన్సి వేసిన బొమ్మలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.

Updated Date - 2022-06-14T06:01:06+05:30 IST