ప్రపంచంలోనే పేద్ద బ్యాట్‌..

ABN , First Publish Date - 2021-10-24T08:46:22+05:30 IST

నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రపంచంలోనే పేద్ద బ్యాట్‌..

కవాడిగూడ/హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ బ్యాట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫెర్నోడ్‌ రికార్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూపొందిన ఈ బ్యాట్‌ పొడవు 56.1 అడుగులు. పాప్లర్‌ ఉడ్‌ (బూరుగ తరహా చెక్క)తో తయారుచేసిన ఈ బ్యాట్‌ బరువు 9 టన్నులు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ కూడా దక్కించుకున్న ఈ బ్యాట్‌ నిర్మాణానికి నెలరోజులు పట్టిందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్‌ను ఇక్కడ ఉంచామన్నారు. ఈ బ్యాట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్‌, పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-24T08:46:22+05:30 IST