పాఠశాలలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-19T06:01:38+05:30 IST

మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల లో 10వ తరగతి విద్యార్థినుల తరగతి గదిలో పీవోపీ కుప్ప కూలిపోయింది. దసరా పండుగ కారణంగా గత 10 రోజు లుగా సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాలలో తప్పిన పెను ప్రమాదం
పాఠశాలలోని తరగతి గదిలో కుప్పకూలిన పీవోపీ

తరగతి గదిలో కూలిన పీవోపీ

సెలవులు కావడంతో బయటపడ్డ విద్యార్థినులు

లింగంపేట, అక్టోబర్‌ 18: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల లో 10వ తరగతి విద్యార్థినుల తరగతి గదిలో పీవోపీ కుప్ప కూలిపోయింది. దసరా పండుగ కారణంగా గత 10 రోజు లుగా సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. గతగతి గదిలో గతంలో విద్యార్థినిలకు కంప్యూటర్‌ శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు పీవోపీతో అందంగా తయారు చేశారు. తరువాత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్‌ శిక్షణ ను ప్రభుత్వం ఎత్తివేయడంతో గత కొన్ని సంవత్సరాలుగా ఆ గదిని ఉపాధ్యాయు లు 10వ తరగతి కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తరగతి గది పైకప్పు తడిసి పీవోపీ కూలీపోయి ఉంటుందని ఉపాధ్యాయు లు అంటున్నారు. అయితే, సెలవు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పాఠశాలలో తరగతులు నిర్వహించే సమయంలో కూలి ఉంటే పెద్ద ప్రమా దం జరిగేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలోని గదులు పూర్తిగా శిథిలమైన ప్రమాదకరంగా మారాయని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని, భయం భయంగా ఉంటున్నామని, విషయాన్ని గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంఈవో రామస్వామి కూలిన తరగతి గదిని పరిశీలించారు.

Updated Date - 2021-10-19T06:01:38+05:30 IST