పోలీసులకు మంచిపేరు : సీపీ

ABN , First Publish Date - 2020-05-21T09:39:22+05:30 IST

పోలీసులకు మంచిపేరు : సీపీ

పోలీసులకు మంచిపేరు : సీపీ

ఉత్తమ పనితీరు కనబర్చిన 78 మందికి ప్రశంసాపత్రాలు అందజేత


హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వేళ ట్రాఫిక్‌ పోలీసుల పనితీరు, సేవానిరతి కారణంగా సిటీ పోలీసులకు మంచి పేరు వచ్చిందని.. దీనికి కారణమైన వారిని గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత అని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 78 మంది ట్రాఫిక్‌ సిబ్బందికి ప్రశంసాపత్రాలు, మెమొంటోలను బుధవారం అందజేశారు. కరోనా విస్తరిస్తున్న వేళ విధుల్లో ఉన్న సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మహారాష్ట్రలో 1,358 మంది పోలీసులకు కరోనా సోకిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌కుమార్‌, డీసీపీలు ఎల్‌ఎస్‌ చౌహాన్‌, బాబురావు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-21T09:39:22+05:30 IST