కేంద్ర బిల్లుతో ప్రయోజనం శూన్యం: పెద్ది

ABN , First Publish Date - 2020-09-23T06:01:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు చేకూరే ప్రయోజనం శూన్యమని, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

కేంద్ర బిల్లుతో ప్రయోజనం శూన్యం: పెద్ది

నర్సంపేట, సెప్టెంబరు 22 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు చేకూరే ప్రయోజనం శూన్యమని, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆ రోపించారు. బిల్లుకు నిరసనగా నియోజకవర్గంలోని మండలాల నుంచి తరలి వచ్చిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో  నర్సంపేటలో మంగళవారం ర్యాలీని నిర్వహించారు  ట్రాక్టర్‌ను నడుపుతూ ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని వరంగల్‌రోడ్‌ నుంచి అంబే ద్కర్‌ సెంటర్‌ మీదుగా పాకాల రోడ్‌, వ్యవసాయ మార్కెట్‌ గుండా అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ కొనసాగింది.


అమర వీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే మాట్లాడు తూ బిల్లును ఉపసంహరించుకోకుంటే రైతులను సమీకరించి ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న నిబంధనతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. బిల్లును రద్దు చేయకుంటే ప్రభుత్వ బడ్జెట్‌ నుంచే డబ్బు లు ఖర్చుచేసి రైతులకు మద్దతుగా ఢిల్లీ వరకు లక్షలాది  ట్రాక్టర్ల తో తరలివెళ్లి పార్ల మెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనికి సీఎం కేసీఆర్‌ నాయకత్వం వహిస్తా రని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామి, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T06:01:27+05:30 IST