మోగిన ఎన్నికల నగారా

ABN , First Publish Date - 2021-04-16T05:18:34+05:30 IST

పాలక వర్గాల పదవీ కాలం ముసిగిన మునిసి పాలిటీల్లో ఎన్నికల నగారా మోగింది.

మోగిన ఎన్నికల నగారా
డిప్‌ ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేస్తున్న కలెక్టర్‌ శర్మన్‌

- 30న జడ్చర్ల, అచ్చంపేట పురపాలికలకు ఎన్నికలు


అచ్చంపేట/జడ్చర్ల, ఏప్రిల్‌ 15 : పాలక వర్గాల పదవీ కాలం ముసిగిన మునిసి పాలిటీల్లో ఎన్నికల నగారా మోగింది. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి మహబూబ్‌న గర్‌ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు జ రగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది.


జడ్చర్ల చైర్మన్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌

జడ్చర్ల మునిసిపాలిటీలో 41,515 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 20,765 పు రుషులు, 20,749 స్త్రీలు, ఇతరులు ఒకరు ఉన్నారు. 27 వార్డులుండగా, బాదేపల్లి, జడ్చర్ల, కావేరమ్మపేట, బురెడ్డిపల్లి, నాగసాల, శంకరాయపల్లితండా మునిసిపాలిటీ పరిధిలో ఉన్నాయి. చైర్మన్‌ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు. ఎస్టీ జనరల్‌కు 9వ వార్డు, ఎస్సీ మహిళకు 7వ వార్డు, ఎస్సీ జనరల్‌కు 6, 26వ వార్డులను కేటా యించారు. బీసీ మహిళకు 1, 17, 19, 21వ వార్డులు, బీసీ జనరల్‌కు 2, 10, 13, 18, 23వ వార్డులు, జనరల్‌ మహిళకు 5, 11, 14, 15, 16, 20, 22, 25వ వార్డులు, జనరల్‌ స్థానాలకు 3, 4, 8, 12, 24, 27వ వార్డులను కేటాయించారు.


అచ్చంపేట చైర్మన్‌ స్థానం జనరల్‌కు రిజర్వ్‌

అచ్చంపేట మునిసిపాలిటీలో మొత్తం 20,529 మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో పురుషులు 10,428, స్ర్తీలు 10,100 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. లక్కీ డిప్‌ ద్వారా గురువారం కలెక్టర్‌ ఎల్‌పీ శర్మన్‌ వార్డుల రిజర్వేషన్‌ను ఖరారు చేశారు. మొత్తం 20 వార్డులున్న ఈ మునిసిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని జనరల్‌కు కేటాయించారు. ఓసీ మహిళకు 2, 7, 10, 11, 12, 19వ వార్డులు, ఓసీ జనరల్‌కు 14, 15, 18, 20వ వార్డులు, ఎస్టీ జనరల్‌కు 3వ వార్డు, ఎస్టీ మహిళకు 9వ వార్డు, ఎస్సీ మహిళకు 8, 13వ వార్డులు, ఎస్సీ జనరల్‌కు 17వ వార్డు, బీసీ మహిళకు 4, 5వ వార్డులు, బీసీ జనరల్‌కు 1, 6, 16వ వార్డులు కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మ నుచౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T05:18:34+05:30 IST