నమ్మించి హత్య చేశారు

ABN , First Publish Date - 2021-12-09T06:27:55+05:30 IST

నమ్మకంగా ఉంటూ నమ్మించి మోసగించి అత్యాచా రం చేయడమే కాకుండా వారి వద్ద ఉన్న డబ్బులు వెండి, కడియాలను తీసుకుని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపారు.

నమ్మించి హత్య చేశారు
కామారెడ్డిలో మహిళల హత్యకేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

మహిళలు మగవారితో నిర్జీవ ప్రాంతాలకు వెళ్లొద్దు  

వాడి, దేవునిపల్లి శివారులో హత్యకు గురైన మహిళల సంఘటనలే నిదర్శనం  

ఇద్దరు మహిళల హత్యలో ఇద్దరి అరెస్టు రిమాండ్‌

కామారెడ్డి డీఎస్పీ సోమనాథం

కామారెడ్డి, డిసెంబరు 8: నమ్మకంగా ఉంటూ నమ్మించి మోసగించి అత్యాచా రం చేయడమే కాకుండా వారి వద్ద ఉన్న డబ్బులు వెండి, కడియాలను తీసుకుని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపారు. కామారెడ్డిలో అడ్డాకూలీ పని కోసం వచ్చి పురుషుల మాయమాటలను నమ్మి నిర్జీవ ప్రాం తాలకు వెళ్లిన ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యా రు. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలో ని దేవునిపల్లిలోని దేవీవిహార్‌ ఫోర్త్‌ ఫేస్‌ సమీపంలో ఓ మహిళ కుళ్లిపోయిన శవం మంగళవారం వెలుగు చూసిన విషయం విధితమే. ఈ హత్యకు గురైన మహిళ కామారెడ్డి మండలం క్యా సంపల్లితండాకు చెందిన అనితగా గుర్తించినట్లు తెలిపారు. గత నెల 17న క్యాసంపల్లి తండా నుంచి అడ్డాకూలీగా కామారెడ్డికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె భర్త దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేవునిపల్లి పోలీసులు మహిళ అదృశ్యం కేసుగా  నమోదు చేసుకుని దర్యాప్తు ప్రా రంభించినట్లు డీఎస్పీ తెలిపారు. అనిత కాల్‌డేటా ఆధారంగా విచారణ చేయగా లింగంపేట మండలం పర్మిలతండాకు చెందిన ప్రకాష్‌ అనితను మాయమాటల తో అడ్డాకూలీ వద్ద పరిచయ ం చేసుకుని లోబర్చుకుని ఆమె వద్ద ఉన్న వెండి కడియా లపై కన్ను వేసి దేవునిపల్లి శివారులోని దేవీవిహార్‌ ఫోర్త్‌ఫేస్‌ సమీపంలోని కంది చేనులోకి తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారంచేసి చీరతో గొంతునులిమి హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలను ఎత్తికెళ్లినట్లు ప్రకాష్‌ పోలీసులకు వివరించినట్లు డీఎస్పీ తెలిపారు. మాచారెడ్డి మండలం వాడి శివారులోని చెరుకు తోటలో కుళ్లిపోయిన శవాన్ని మాచారెడ్డి పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై విచారణ చేయగా తాడ్వాయి గ్రామానికి చెందిన కుంట స్వరూప అనే వివాహిత కూలి పని కోసం కామారెడ్డిలోని అడ్డాకూలీ వద్దకు వచ్చి ఇంటి కి వెళ్లేది. గత అక్టోబరు 28న ఇంట్లో కూలి పనికి వెళ్తున్నానని చె ప్పి కామారెడ్డికి వచ్చి తిరిగి ఇంటి కి వెళ్లకపోవడంతో ఆమె అత్త తాడ్వాయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. డిసెంబరు 1 న స్వరూప మృతదేహం కుళ్లిపోయి వాడి శివారులోని చెరుకుతోట లో వెలుగుచూసింది. ఈ విషయంపై తాడ్వాయి పోలీసులకు సమాచారం ఇవ్వగా మిస్సింగ్‌ కేసు కాబట్టి స్వరూప కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి స్వరూప మృతదేహంగా గుర్తించినట్లు తెలిపారు. కామారెడ్డికి వచ్చి అడ్డాకూలీగా పనిచేస్తూ ఇంటికి వెళ్లేది. స్వరూప మరిది కుం ట అల్లూరి రాజు లోబర్చుకుని ఆమె వద్ద నుంచి అవసరం ఉన్న సమయంలో డబ్బులు తీసుకుంటూ ఇవ్వ కుండా దాటవేస్తు చనువుగా ఉండడం చూసి మనస్సులో పెట్టుకుని నవంబరు 28న మాచారెడ్డి మండలంలోని వాడి గ్రా మ శివారుకు తీసుకుని వెళ్లి వారు ఇద్దరు శారీరకంగా కలిసిన తర్వాత రాజు తన వది నతో గొడవపడి ఆమె వద్ద ఉన్న రూ.800తీసుకుని చీర కొంగు తో ఉరివేసి హత్యచేసి చెరుకుతోటలో శవాన్ని పడేసి పైన కనపడకుండా చెరుకు వాడే ను వేసి పారిపోయినట్లు పోలీసుల విచారణలో రాజు నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎ స్పీ తెలిపారు. రాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. అదృశ్యమైన మహిళ కేసులను ఛేదించిన కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌, మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలను అభినందించినట్లు తెలిపారు. ఎవరైన ఒంటరిగా ఉన్న మహిళలుపై అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-12-09T06:27:55+05:30 IST