May 6 2021 @ 00:14AM

అందం ఏ మాత్రం తగ్గలేదు!

హాలీవుడ్‌ నటి, పాప్‌సింగర్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌ 51 ఏళ్ల వయసులోనూ తన అందంతో యూత్‌కు ఆరాధ్య దేవతగా నిలుస్తున్నారు. ఆమె అందానికి, గాత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ఆమె కేలీఫోర్నియాలోని ఇంగిల్‌వుడ్‌లో ఈ నెల 8న జరిగే వాక్స్‌ లైవ్‌ షో కోసం సిద్ధమవుతున్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విరాళాల సేకరణ కోసం ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. పలువురు ప్రముఖులతో పాటు జెన్నిఫర్‌ లోపెజ్‌ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్‌ చేస్తున్నారు. ఆ కార్యక్రమం కోసం రిహార్సల్స్‌ చేసేటప్పుడు దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేయగా అభిమానులు ‘51 ఏళ్ల వయసులోనూ నీ అందం ఏ మాత్రం తగ్గలేదు’ అంటూ లోపెజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.