అధ్యక్ష స్థానంపై ఆధిపత్య పోరు

ABN , First Publish Date - 2022-05-26T05:13:16+05:30 IST

అధ్యక్ష స్థానంపై కారంచేడు మండల సమావేశంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మండల సమావేశానికి ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అధ్యక్షత వహించాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా రెండో వైస్‌ ఎంపీపీ ఐనంపూడి వనజను కోరగా, ఒకటో వైస్‌ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధ్యక్ష స్థానంపై ఆధిపత్య పోరు
కారంచేడు మండల సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు

సమావేశం నుంచి వైస్‌ ఎంపీపీ, జడ్పీటీసీ వాకౌట్‌

 తూతూ మంత్రంగా కారంచేడు మండల సమావేశం

కారంచేడు(పర్చూరు), మే 25: అధ్యక్ష స్థానంపై కారంచేడు మండల సమావేశంలో ఆధిపత్య పోరు  కొనసాగుతోంది. బుధవారం జరిగిన మండల సమావేశానికి ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అధ్యక్షత వహించాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. దీంతో   సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా రెండో వైస్‌ ఎంపీపీ ఐనంపూడి వనజను కోరగా, ఒకటో వైస్‌ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి వైస్‌ ఎంపీపీగా ఉన్న తనను కాదని రెండో వైస్‌ ఎంపీపీని అధ్యక్షత వహించడమనడం సభను అవమానించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.అతనికి మద్దతుగా జడ్పీటీసీ యార్లగడ్డ రజని కూడా సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం  సమావేశం తూతూ మంత్రంగా ముగిసింది. దీనిపై ఎంపీడీవో రమే్‌షను వివరణ కోరగా ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు సూచనల మేరకే మహిళా స్థానంలో ఉన్న రెండో వైస్‌ ఎంపీపీకి అధ్యక్ష స్థానం అప్పగించామని చెప్పారు.

 

Updated Date - 2022-05-26T05:13:16+05:30 IST