బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-10-21T06:56:15+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకల దాడులను నిరసిస్తూ బుధవారం కనిగిరి పట్టణంలో టీడీపీ చేపట్టిన బంద్‌ విజయవంతమైంది.

బంద్‌ విజయవంతం
నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

నేతలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు 

అయినా వెనక్కి తగ్గని టీడీపీ కార్యకర్తలు

  కనిగిరి, అక్టోబరు 20: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకల దాడులను నిరసిస్తూ బుధవారం కనిగిరి పట్టణంలో టీడీపీ చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా బంద్‌లో పాల్గొన్న టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజల్లో ఆదరణ తగ్గి, టీడీపీకి ప్రజాధరణ పెరగడంతో కుట్రపూరితంగా టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై దాడులు చేస్తూ, విఽధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలపార్టీ అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు,  ఆ పార్టీ నాయకులు బేరి పుల్లారెడ్డి రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, బ్రహ్మంగౌడ్‌, కాసుల శ్రీరాములు, జంషీర్‌ అహ్మద్‌, రోషన్‌ సందాని, తమ్మినేని వెంకటరెడ్డి, శ్రీను, ఫిరోజ్‌, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు బంద్‌ కార్యాక్రమంలో పాల్గొన్నారు. 

టీడీపీ కార్యకర్తలు బుధవారం తెల్లవారుఝామున 4 గంటలకే ఆర్టీసీడిపోకు చేరుకుని బంద్‌ కార్యక్రమంలో పాల్గొని బస్సు రాకపోకలు నిలిపేశారు. ఈ సమయంలో పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా ఆ పార్టీ బంద్‌ను కొనసాగింది. ఉదయం వాహనాల రాకపోకలను, వ్యాపార సంస్థలను, బ్యాంకులను, షాపులను మూసి వేయించారు. దీంతో సీఐ పాపారావు, ఎస్‌ఐ రామిరెడ్డి సర్కిల్‌లోని పోలీసు సిబ్బంది బంద్‌ను అడ్డుకున్నారు. వీరిని సీఐ పాపారావు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు టీడీపీ నాయకులకు వాగ్వాదం జరిగింది. పోలీసు స్టేషన్‌కు తరలించిన అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై టీడీపీ నాయకులను పోలీసులు విడిచిపెట్టారు.

ముండ్లమూరు : టీడీపీ మండల అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ముండ్లమూరులోని ఎన్‌టీఆర్‌ విగ్రహం ఎదురుగా అద్దంకి - దర్శి ప్రధాన రహదారి పై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయించడానికి ప్రదర్శనగా వెళ్తుండగా ఎస్‌ఐ జీ వెంకట సైదులు తన సిబ్బందితో వెళ్ళి నాయకులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం వ్యక్తి గత పూచీ కత్తు పై వారిని విడుదల చేశారు. కార్యక్రమంలో దర్శి నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మేరదమెట్ల వెంకటరావు, ఆ పార్టీ నేతలు వరగాని పౌలు, మాజీ జెడ్పీటీసీ కొక్కిర నాగరాజు, సర్పంచ్‌లు ఒద్దిపోగు గురవయ్య, కూరపాటి నారాయణస్వామి, మాజీ సర్పంచ్‌లు బద్రి గోపాలరెడ్డి, చావా బ్రహ్మయ్య, జిల్లెలమూడి చౌదరి, ఇందూరి పిచ్చిరెడ్డి, మేదరమెట్ల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 

తాళ్లూరు : టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు నిరసనగా  బుధవారం నాగంబొట్లపాలెంలో టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. గ్రామంలోని దుకాణాలను మూసివేయించారు. టీడీపీ యువనాయకులు యాతం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలో బంద్‌ కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో సుబ్బారెడ్డి, సాయిబాబు, ప్రభు, తిమోతి, యర్రయ్య, కాంతారావు, ఆదాము పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

దొనకొండ : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు నేతృత్వంలో బుధవారం నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ దుగ్గెంపూడి చెంచయ్య, నాయకులు యగ్గోని యల్లారెడ్డి, పత్తి వెంకటేశ్వర్లు, కొమ్మతోటి సుబ్బారావు, యరగొర్ల బసవయ్య, పురుషోత్తం సత్యానందం, షేక్‌ తోహిద్‌, పరుచూరి రామలింగయ్య, బండ్లా వెంకటనారాయణ, తోటా వెంకటేశ్వర్లు, బొందల చిన్నమరియదాసు, మరికొందరు నాయకులు కార్యకర్తలు బస్టాండ్‌ సెంటర్‌ నుండి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలను, రెవెన్యూ, మండల పరిషత్‌ కార్యాలయాలు మూసివేయించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ ఘటన జరగలేదు. . 

దర్శి : పట్టణంలో టీడీపీ శ్రేణులు బంద్‌ చేయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్యలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు,  టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి ఎం.శోభారాణి, టీడీపీ నాయకులు పారా గాలెయ్య, జీసీ.గురవయ్య, గుర్రం.బాలకృష్ణ, పుల్లలచెరువు చిన్నా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయటం ధారుణమని మాజీ ఎమ్మెల్యే పాపారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుడ్లూరు : టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో ఆ పార్టీ నాయకులను ముందుగానే హౌస్‌అరెస్ట్‌లు, ముందస్తు అరెస్టులు చేశారు. మధ్యాహ్నం తర్వాత వీరిని విడుదల చేశారు. అనంతరం వైసీపీ, పోలీసుల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జనిగర్ల నాగరాజు, చిత్తారి మల్లికార్జున, చెన్నారెడ్డి మహేష్‌, మాజీ ఎంపిటీసీ మద్దసాని కృష్ణ, ఉమ్మడిప్రోలు కోటేశ్వరరావు, మేకపోతుల రాఘవులు, రావూరి వేణు, బుల్లియ్య, చల్లావీరరాఘవులు, పువ్వాడి వేణు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. 

లింగసముద్రం : తెలుగుదేఽశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన బంద్‌ను విజయవంతం చేసేందుకు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కందుకూరుకు తరలి వెళ్లారు. టీడీపీ  మండల అధ్యక్షులు వేముల గోపాలరావు, నాయకులు అడపా రంగయ్య, బొల్లినేని నాగేశ్వరరావు, గొర్రెపాటి సాంబయ్య, పలుగ్రామాల నాయకులున్నారు. 

వెలిగండ్ల : దాడులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ నిరసనల్లో భాగంగా బుధవారం వెలిగండ్లలో టీడీపీ కార్యకర్తల ర్యాలీ నిర్వహించి మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ రైతు నాయకులు ఇంద్రభూపాల్‌రాడ్డి,కొండు భాస్కర్‌రెడ్డి, కేసరి రమణారెడ్డి, మీనింగ కాశయ్య, క్రిష్ణారావు, వెంకటేశ్వరు,్ల వెంకటయ్య, బాలకోటయ్య, బద్రి తదితరులు ఉన్నారు. 

సీఎ్‌సపురం : రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, నారాయణస్వామి దేవస్థాన మాజీ చైర్మన్‌ పాములపాటి మాధవప్రసాద్‌, మాజీ సర్పంచ్‌  పునుగుపాటి రవికుమార్‌, టీడీపీ నాయకులు బొబ్బూరి రమేష్‌, బత్తుల వెంకటాద్రి, పోకల రవిచంద్ర, సంగిశెట్టి రమేష్‌, దౌలత్‌, రజ్జబ్‌బాషా, షేక్‌.షాను, మాబూ, బొబ్బూరి తిరుపతయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

పీసీపల్లి : ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే వారిని భయపెట్టాలనుకుంటే అది వైసీపీ నాయకుల భ్రమేనని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి భౌతికదాడులతో టీడీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కార్యక్రమంలో వేమూరి రామయ్య, సర్పంచులు కరణం తిరుపతయ్య, గడ్డం సుబ్బరాయుడు, పల్లా మల్లికార్జున్‌, టీడీపీ నాయకులు అంజయ్య, కేశవులు, శివరామయ్య, సుబ్బరాయుడు, హనుమారెడ్డి, ఎబినేజరు, ఏసుదాసు, యోగయ్య, నాగేంద్రబాబు, రాజేంద్ర, వెంకట్రావు, రత్తయ్య తదితరులు ఉన్నారు.

పామూరు : ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడటం సమంజసం కాదని ఇలాంటి దాడులను సీపీఎం ఖండిస్తుందని పశ్చిమ ప్రకాశంజిల్లా సీపీఎం కార్యదర్శి ఎస్‌డి హనీఫ్‌ తెలిపారు. స్థానిక సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను హుందాగా స్వీకరించి తప్పులు సరిచేసుకోవాలన్నారు. సమావేశంలో షేక్‌ మీరావలి, మాల్యాద్రి, అల్లాభక్షు, విఠల్‌రావ్‌, ఖాశీంసాహెబ్‌, వై వీరనారాయణ, షేక్‌ చాంద్‌బాష పాల్గొన్నారు. 

కందుకూరు : టీడీపీ కార్యాలయాలపై, ఆపార్టీ నాయకుల ఇళ్లపై ఏకకాలంలో ముష్కరులు దాడిచేసి విధ్వంసం సృష్టించటాన్ని నిరసిస్తూ కందుకూరులో బుధవారం బంద్‌ నిర్వహిం చారు. అయితే వీరిని అడ్డుకొనేందుకు పోలీసులు ఎక్కడిక్కడ  టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వాహనాల రాకపోకలను అడ్డుకోగా కొద్దిసేపటికే డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ వి.శ్రీరామ్‌, ఎస్‌ఐలు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులను బలవంతంగా అరెస్టు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. పోస్టాఫీస్‌ కూడలిలోను టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. బంద్‌ నేపథ్యంలో మాజీఎమ్మెల్యే దివి శివరాం టీడీపీ యువనాయకుడు ఇంటూరి రాజేష్‌లను ముందుగానే అరెస్టులు చేశారు. వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి, నార్నె రోశయ్య, దామా మల్లేశ్వరరావు, వేముల గోపాల్‌, మాదాల లక్ష్మీనరసింహం, గట్టమనేని చెంచురామయ్య, చిలకపాటి మధు, రఫి, ఎన్‌వీ.సుబ్బారావు, గోచిపాతల మోషే,  షేక్‌ జియావుద్ధీన్‌, మున్నా, సలాం, ఎన్‌వీ.రమణ య్య,  తదితరులు పాల్గొన్నారు.. ఉలవపాడులోనూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.  మండలంలోని చాకిచర్ల, కరేడు గ్రామాల్లో బంద్‌ చేపట్టారు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు పిలుపు మేరకు గ్రామాల్లోని స్కూల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాలు ,బ్యాంక్‌లు, సచివాలయం, మీసేవా కేంద్రాలను బంద్‌లో భాగంగా మూపించేశారు.

కొండపి : టీడీపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడికి నిరసనగా టీడీపీ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు కొండపిలో నాయకులు, కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. స్థానిక కామేపల్లి రోడ్డు సెంటర్‌లో ఎస్సై వి.రాంబాబు టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యల్లమంద నాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ రావిపాటి మధుసూదనరావు,  టీడీపీ నాయకుడు నన్నూరి సుబ్బరామయ్యతోపాటు మరి కొందర్ని అరెస్ట్‌ చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. బంద్‌ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే ఎస్సై వి.రాంబాబు వెన్నూరు గ్రామం వెళ్లి టీడీపీ నేత, కొండపి ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య చౌదరిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అదేవిధంగా టీడీపీ జరుగుమల్లి మండల అధ్యక్షుడు పోకూరి రవిని చతుకుపాడులోని ఇంటిలో నుంచి బయటకు రాకుండా ఎస్సై రజియా సుల్తానా బేగం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 

జరుగుమల్లిలో : టీడీపీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ నిర్వహించారు. ఆ పార్టీ  జిల్లా నాయకుడు పోటు శ్రీనివాసమురళి (పెదబాబు), రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి పేముల విజయనిర్మల, మండల ప్రధాన కార్యదర్శి నరాల సోమయ్య, నాయకులు సుబ్బారెడ్డి, మక్కెన శ్రీనివాస్‌, కృష్ణారావు, అక్కచెరువుపాలెం కృష్ణ, నలమోతు హరినాథ్‌, జనార్థన్‌రావు, కోట వెంకటనారాయణ పాల్గొన్నారు.

పొన్నలూరులో టీడీపీ నాయకుల అరెస్ట్‌ 

పొన్నలూరు : పొన్నలూరులో బంద్‌ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను ఎస్సై అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ‘డ్రగ్స్‌ సీఎం, దద్దమ్మ సీఎం డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. 

ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద పోలీసుల హల్‌చల్‌

టంగుటూరు : మండలంలోని తూర్పునాయుడుపాలెంలో ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి గృహం వద్ద బుధవారం పోలీసులు హల్‌చల్‌ చేశారు. సింగరాయకొండలో జరిగే బంద్‌లో ఎమ్మెల్యే పాల్గొంటారని పార్టీ ప్రకటించడంతో బుధవారం ఉదయానికే సింగరాయకొండ సీఐ లక్ష్మణ్‌, టంగుటూరు ఎస్సై నయూబ్‌రసూల్‌ తమ సిబ్బందితో తూర్పునాయుడుపాలెంలోని ఎమ్మెల్యే గృహానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నట్లుగా ప్రకటించి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. సీఐ లక్ష్మణ్‌ ఎమ్మెల్యే స్వామికి నోటీసులివ్వబోగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వామి రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలకు వివరించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. 

పోలీసులు బలవంతంగా అడ్డుకున్నా, పోలీసులతో తీవ్ర వాదోపవాదాల నడుమ, వారిచెరనుంచి చాకచక్యంగా తప్పించుకొని గేటుదాటి ఎమ్మెల్యే తన పార్టీ శ్రేణులతో బయటకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగు యువత మండల అధ్యక్షుడు కాట్రగడ్డ అనిల్‌, పార్టీ నాయకుడు ఈదర ప్రభాకర్‌ ఎమ్మెల్యేకి మద్దతుగా పోలీసులతో వాదించారు. బయటకు రానివ్వకుండా అడ్డుగా నిలబడ్డ ఎస్సైని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘మీరు ఈ విధంగా బలవంతం చేస్తే మేము నిరవధిక ఆందోళన చేయాల్సి ఉంటుంది’ అని కూడా ఎమ్మెల్యే హెచ్చరించారు. తమ ఇంటి పరిసరాలలో వైసీపీ అరాచక పాలనపై నిరసన తెలిపేందుకు అంగీకరించాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. గేటు బయట తన అనుచరులతో కలసి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. బంద్‌ను అడ్డుకొనేందుకు  సింగరాయకొండ సీఐ లక్ష్మణ్‌, టంగుటూరు ఎస్సై నయూబ్‌రసూల్‌లు టీడీపీ ముఖ్యనాయకులను గృహ నిర్బంధం చేశారు. తూర్పునాయుడుపాలెంలో ఎమ్మెల్యే స్వామిని, ఒంగోలులో ఉన్న పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దామచర్ల సత్యను, మండల పార్టీ అధ్యక్షుడు కామని విజయకుమార్‌, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్‌లకు గృహ నిర్భంధం నోటీసులిచ్చి నిర్బంధించారు

బంద్‌ నిర్వాహకుల అరెస్ట్‌

ఉదయం బంద్‌ నిర్వహణకు టీడీపీ నాయకులు  ఒక్కొక్కరిగా టంగుటూరులోని ప్రధాన కూడలికి చేరుకుంటుండగా అప్పటికే అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. నాయకులు, కార్యకర్తలు బస్టాండ్‌ సెంటర్‌లోని బజార్ల వెంట తిరుగుతూ ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార దుకాణాలను మూయిస్తూ సెంటర్‌కి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకొని కార్యకర్తలు ముందుకు సాగుతుండగా తొలుత తెలుగు యువత మండల అధ్యక్షుడు కాట్రగడ్డ అనిల్‌ను అడ్డుకొని బలవంతంగా ఆటో ఎక్కించి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత మిగిలిన వారిని అరెస్టు చేశారు. సుమారు 20 మందిని మధ్యాహ్నం వరకు పోలీ్‌సస్టేషన్‌లో నిర్బంధించారు

అధికార పార్టీ తొత్తులుగా పోలీసులు

మంగళగిరిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపై 200 మంది వైసీపీ గూండాలు దాడులకు పాల్పడుతుంటే చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు తమనుమాత్రం ముందుస్తు అరెస్టులు చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 

సింగరాయకొండ : టీడీపీ బంద్‌ నేపథ్యంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూసివేయించారు. స్వచ్ఛందంగా పలు విద్యాసంస్థలు మూతబడ్డాయి. ి స్థానిక తెలుగు తముళ్లు బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో చీమకుర్తి కృష్ణ, గాలి హరిబాబు, చీమకుర్తి కృష్ణ, శీలం చంటి, చిమ్మిరి చెంచురామయ్య, కళ్లగుంట నరసింహా, ఓలేటి రవిశంకర్‌రెడ్డి, వెంకటేశ్‌, మేకల అంకారావు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యనాయకుల హౌస్‌ అరెస్ట్‌

మండలంలోని టీడీపీ ముఖ్య నాయకులందరికీ పోలీసులు నోటీసులు అందజేసి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బంద్‌కు ప్రభుత్వ అనుమతి లేదని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించే బంద్‌ జరగక్కుండా పోలీసులను అడ్డుపెట్టుకోవడం వైసీపీ ప్రభుత్వ పరికిపంద చర్యగా పలువురు నాయకులు అభివర్ణించారు.


Updated Date - 2021-10-21T06:56:15+05:30 IST