ప్రజ్ఞ పాటల బాలు

ABN , First Publish Date - 2020-09-30T07:08:55+05:30 IST

చిగురులే పాడగా చేయెత్తి మ్రొక్కగా సిద్ధసంస్కారిగా ఓ కూనలమ్మా! భావాలు పూయగా పాడు ‘తా’ తీయగా అందరకు హాయిగా...

ప్రజ్ఞ పాటల బాలు

చిగురులే పాడగా

చేయెత్తి మ్రొక్కగా

సిద్ధసంస్కారిగా

ఓ కూనలమ్మా!


భావాలు పూయగా

పాడు ‘తా’ తీయగా

అందరకు హాయిగా

ఓ కూనలమ్మా!


‍పాట పాడుట కింగు

ఘన నటన జంపింగు

సవ్యసాచి సొబంగు

ఓ కూనలమ్మా!


పాడాడు అన్నమయ

అంటాను దణ్ణమయ

మాటలే రావయ్య
ఓ కూనలమ్మా!

తీగ సాగెడి గొంతు
తీపి పంచిన తంతు
జుర్రుకొన మన వంతు
ఓ కూనలమ్మా!

బాలు పాడుటె ఘనము
ఏమి ఇచ్చిన ఋణము
తీర్చగలదీ జనము
ఓ కూనలమ్మా!

విజ్ఞ రసికులనేలు
ప్రజ్ఞ పాటల బాలు
విన బ్రతుకునకు చాలు
ఓ కూనలమ్మా!
సన్నిధానం నరసింహశర్మ

Updated Date - 2020-09-30T07:08:55+05:30 IST