Abn logo
Sep 21 2021 @ 01:08AM

అధికారులు మా చెప్పులు మోయాల్సిందే!

  • దానికి తప్ప ఎందుకూ పనికిరారు
  • వాళ్లను మా రాజకీయాలకు వాడుకుంటాం
  • కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి 
  • వివాదాస్పద వ్యాఖ్యలు


 భోపాల్‌, సెప్టెంబరు 20: కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారులు తమ చెప్పులు మోయడానికి తప్ప ఎందుకూ పనికిరారన్నారు.  కులాల ఆధారంగా జనగణన చేయాలన్న డిమాండ్‌తో తనను కలిసిన స్థానిక ఓబీసీ నాయకుల బృందంతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

 ‘‘నాయకులు.. అధికారులు చెప్పినట్లు నడుచుకుంటారని అనుకుంటున్నారా? కానే కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా మేం చర్చించుకుంటాం. ఆ తర్వాత వాళ్లు ఫైల్‌ సిద్ధం చేస్తారు. అంతేగానీ, వాళ్లు మమ్మల్ని కంట్రోల్‌ చేయడమేంటి? అసలు వాళ్ల సామర్థ్యం ఎంత? పోస్టింగులు, జీతాలు ఇచ్చేది మేమే. ప్రమోషన్లయినా, డిమోషన్లయినా మేమే ఇవ్వాలి. వాళ్లేం చేస్తారు? మా చెప్పులు మోయడానికి మాత్రమే వాళ్లను అనుమతిస్తాం. నిజం ఏంటంటే.. మా రాజకీయాలకు మేమే వాళ్లను వాడుకుంటాం’’ అని ఈ బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ నేత వ్యాఖ్యానించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.