అధికారులు సహకరించరు

ABN , First Publish Date - 2021-01-24T08:13:58+05:30 IST

సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు పంచాయతీ ఎన్నికల విధులకు ఏ అధికారీ, ఏ ఉద్యోగీ సహకరించరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.

అధికారులు సహకరించరు

సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే నిర్ణయం:  పెద్దిరెడ్డి 


పుంగనూరు. జనవరి 23: సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు పంచాయతీ ఎన్నికల విధులకు ఏ అధికారీ, ఏ ఉద్యోగీ సహకరించరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో శనివారం జరిగిన మెగా జాబ్‌మేళా సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రిటెర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌కు ఎస్‌ఈసీ గా పదవి ఇవ్వడంతో ఆయన కృతజ్ఞత తీర్చుకునేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌లపై కుట్రపూరిత వ్యూహాన్ని రచిస్తున్నారని, కానీ ప్రజల మ ద్దతు తమకే ఉందన్నారు. ఓటర్ల జాబితా 2020ది కాకుండా 2019దే ఎన్నికలకు వాడబోతున్నారని, దీనికి సమయం ఇవ్వకుండా అధికారులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. చంద్రబాబు కోసం ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని, వచ్చే ఎన్నికల అనంతరం టీడీపీ ఉండబోదని జోస్యం చెప్పారు.

Updated Date - 2021-01-24T08:13:58+05:30 IST