Advertisement
Advertisement
Abn logo
Advertisement

మట్టి మాఫియాకు అధికారులు కొమ్ముకాస్తున్నారు

బీఎస్పీ నేత కాగిత కోటేశ్వరరావు ఆరోపణ 


బాపట్ల: నల్లమడ డ్రెయిన్‌ కట్టలు కొట్టి మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్న మట్టి మాఫియాకు అధికారులు కొమ్ము కాస్తున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కోటేశ్వరరావు ఆరోపించారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పికట్ల రోడ్డులో మూలపాలెం వెళ్ళే వైపు నల్లమడ డ్రెయిన్‌ కట్టను ఓ వ్యక్తి ఇష్టానుసారంగా తవ్వుకెళ్ళాడని దీనిపై డ్రెయినేజి ఉన్నతాధికారులు సైతం వచ్చి పరిశీలించి ఆగ్రహం వ్యక్తంచేశారన్నారు. దీనిపై అప్పట్లో కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పిన డ్రెయినేజీ అధికారులు పట్టించుకోకపోగా, సమాచారం అడిగితే తప్పించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే మట్టిని తవ్వుకెళ్ళిన వారిపై చర్యలు తీసుకోకపోవటం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతోపాటు అవసరమైతే కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. సమావేశంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు బోయిన సాంబశివరావు, పనసాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement