Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 06 Aug 2022 00:00:00 IST

ప్రేక్షకుల ఆశీస్సులు ఊపిరి పోశాయి

twitter-iconwatsapp-iconfb-icon

‘‘మంచి కంటెట్‌ ఉన్న సినిమాలొస్తే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ‘బింబిసార’తో మరోసారి నిరూపణ అయ్యింది. ఇలాంటి విజయం అందించినందుకు చిత్రసీమ తరపున ప్రేక్షకులకు రుణపడి ఉంటా’’ అన్నారు కల్యాణ్‌రామ్‌. ఆయన నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘బింబిసార’. వశిష్ట్‌ దర్శకుడు. శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల కల్యాణ్‌ రామ్‌ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘విజయంతో ప్రేక్షకులు ఆశీర్వదించారు. వారి ఆశీస్సులు ఊపిరి పోశాయి. ఈ చిత్రానికి కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రాణం అందించారు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నాకే రోమాలు నిక్కబొడిచాయి. చోటా కె.నాయుడు మా అందరినీ చాలా అందంగా చూపించారు. ఇది సమష్టి విజయం. దీంతో మా బాధ్యత  మరింత పెరిగింది. రాబోయే ‘బింబిసార 2’ ఇంతకంటే గొప్పగా, తెరకెక్కించడానికి ప్రయత్నిస్తామ’’న్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement