ఎంపీపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2022-01-28T05:14:21+05:30 IST

నిజా మాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ నా యకులు గూండాల్లా వ్యవహరించి దాడి చేయడం అమానుషమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి విమర్శించారు.

ఎంపీపై దాడి అమానుషం
మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి 

- టీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలి

- పార్టీ ఆధ్వర్యంలో ధర్నా 


మహబూబ్‌నగర్‌(క్లాక్‌టవర్‌), జనవరి 27 : నిజా మాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ నా యకులు గూండాల్లా వ్యవహరించి దాడి చేయడం అమానుషమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి విమర్శించారు. గురువారం ఆ పార్టీ పట్టణ అధ్య క్షుడు పోతుల రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయ కులు తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా వీరబ్రహ్మచారి మాట్లాడుతూ పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఎంపీపై, ఆయన వాహనంపై టీఆర్‌ఎస్‌ నాయకులు గుండాల్లా వ్యవహరించి దాడి చేయడం ప్రజాస్వా మిక వ్యతిరేకమని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కా ర్యకర్తలను రెచ్చగొట్టి గుండాయిజం చేయించడం శోచ నీయమన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభు త్వానికి తగిన బుద్ది చెపుతామని ఆయన హెచ్చరిం చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చి రెడ్డి, అంజయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ వేణి, సాహితి, నాగరాజు, సంపత్‌, రమేష్‌, సుబ్రహ్మ ణ్యం, నవీన్‌, అశోక్‌ తదితరులున్నారు.

 రాష్ట్రంలో అరాచక పరిపాలన 

భూత్పూర్‌ : రాష్ట్రంలో అరాచక పరిపాలన కొన సాగుతోందని, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పైన టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడం అన్యాయమని ఆ పార్టీ దేవరకద్ర నియోజవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి విమర్శించారు. గురువారం భూత్పూర్‌ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్ర మంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రవీందర్‌, నాయకులు గాల్‌రెడ్డి, భీమ్‌రాజ్‌, పట్టణ ఉపాధ్యక్షుడు పులగుర్ల మల్లేష్‌, హరినాథ్‌గౌడ్‌, నర్సిములునాయక్‌, మండి మ న్నెం, అనుప రాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గొడుగు ఆంజనేయులు, రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 నియంత పాలనకు త్వరలో చరమగీతం 

హన్వాడ : సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు త్వర లో చరమగీతం తప్పదని బీజేపీ మండల నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం బీజేపీ నాయకులు హన్వాడ ప్రధాన రహ దారిపై రాస్తోరోకో చేసి, నిరసన తెలిపారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పా లనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండ లింగం, పుల్లయ్య, సొసైటీ డైరెక్టర్‌ చెన్నప్ప, వెంకటేష్‌, శేఖర్‌, రవి, ఎస్సీ సెల్‌ జిల్లా నాయ కుడు మన్యం, మల్లేష్‌, సంజీవ్‌, నర్సిములు ఉన్నారు.

 చిన్నచింతకుంటలో రాస్తారోకో

చిన్నచింతకుంట : ఎంపీ అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిని నిరసిస్తూ గురువారం మండల కేం ద్రంలోని బస్టాండు కూడలిలో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్య క్షుడు కుర్వరమేష్‌ మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్‌జీ, రాములు, నరేష్‌, జెట్టెం మధు, బాలచందర్‌, శ్రీను, ఆంజనేయులు, మహేం దర్‌యాదవ్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 దాడులు, అరెస్టులకు భయపడేదిలేదు

మిడ్జిల్‌ : రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం ప్రతిపక్షాలపై పార్టీ నాయకులు, పోలీసులతో దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడికి నిరసనగా మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు విష్ణుభాయ్‌, ఉపాధ్యక్షుడు బాలు, నాయకులు శివ, రాములు తదితరులున్నారు.

 కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం 

బాదేపల్లి : బీజేపీ ఎంపీ అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ గుండాల దాడికి నిరసనగా గురువారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, అనం తరం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సం దర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు మాట్లా డుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్యకర్తలను రెచ్చగొట్టి గుండాయిజం చేయించడం శోచనీయమన్నారు. కార్య క్రమంలో కౌన్సిలర్‌ కుమ్మరిరాజు, నాయకులు మధు గౌడ్‌, వెంకట్‌, బాలు, ఆంజనేయులు, రాజశేఖర్‌రెడ్డి, నరేష్‌, జగదీష్‌, రామకృష్ణ, మహేష్‌యాదవ్‌, సాగర్‌, గోపాల్‌, బాలస్వామి, మల్లేష్‌, వినయ్‌, రవి, భాస్కర్‌, వెంకటేష్‌, చెన్నయ్య పాల్గొన్నారు. 

- అడ్డాకుల : నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌పై జరిగిన దాడికి నిరసనగా గురువారం అడ్డాకులలో బీ జేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ తీరును నా యకులు విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టుమల్లేశ్‌, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, నాయకులు దశరథ్‌రెడ్డి, హరిప్రసాద్‌ రెడ్డి, బుచ్చన్నయాదవ్‌, సురేందర్‌రెడ్డి, కావలిరాజు, తి రుపతినాయక్‌, చెన్నకేశవులు, రవినాయక్‌, జగదీశ్వర చారి, ప్రకాశ్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, వీరేశ్‌, ఆంజనేయు లు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-28T05:14:21+05:30 IST