అసెంబ్లీలో ‘స్టీల్‌ప్లాంట్‌’పై తీర్మానం చేయాలి

ABN , First Publish Date - 2021-05-15T05:07:07+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ మేరకు ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

అసెంబ్లీలో ‘స్టీల్‌ప్లాంట్‌’పై  తీర్మానం చేయాలి
సమావేశమైన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్‌

ఉక్కుటౌన్‌షిప్‌, మే 14: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ మేరకు ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. స్టీల్‌ప్లాంట్‌ సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం సమావేశం జరిగింది. ముందుగా కరోనా మృతులకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు సీహెచ్‌.నరసింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌లు మాట్లాడుతూ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి నాడు ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీకి రిలే నిరాహార దీక్షలు వంద రోజులు పూర్తవుతుందని, ఈ సందర్భంగా ఆర్చ్‌ వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు నిరసన తెలియజేస్తామన్నారు. అదే విధంగా సాయంత్రం ఏడు గంటలకు ఎవరి ఇంటి వద్ద వారు కుటుంబ సభ్యులతో కొవ్వొత్తులు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంధం వెంకటరావు, కె.సత్యనారాయణరావు, వైటీ దాసు, జి.గణపతిరెడ్డి, పల్లారావు, పరమట సత్యనారాయణ, సంపూర్ణం, సురేశ్‌బాబు, డేవిడ్‌, మహాలక్ష్మినాయుడు, నమ్మి రమణ, పిట్టా రెడ్డి, రామస్వామి, నీలకంఠం పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-15T05:07:07+05:30 IST