Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 22 May 2022 02:31:21 IST

జూన్‌లో రారాజు రాక

twitter-iconwatsapp-iconfb-icon

‘కేజీఎఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో యష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రారాజు’. కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఎస్‌. సుబ్బారావు మాట్లాడుతూ ‘యష్‌ ఆయన సతీమణి రాధికా పండిట్‌ జంటగా నటించారు. జూన్‌ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తా’మన్నారు. కిక్‌ శ్యామ్‌, సీత, రవిశంకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్‌రావు దర్శకుడు. సంగీతం: హరికృష్ణ.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International