స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-08-15T03:36:43+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రదర్శించనున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, జిల్లా యువజన శాఖ, క్రీడల శాడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేందుకు స్టేజ్‌, ప్రజలు కూర్చునేందుకు వర్షం వచ్చినా తడవకుండా టెంట్లు, తదితర ఏర్పాట్లను చేపట్టారు.

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
వేడుకలకు సిద్దం చేస్తున్న పరేడ్‌ గ్రౌండ్‌

ఏసీసీ, ఆగస్టు  14: స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రదర్శించనున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, జిల్లా యువజన శాఖ, క్రీడల శాడల శాఖ అధికారి  శ్రీకాంత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేందుకు స్టేజ్‌, ప్రజలు కూర్చునేందుకు వర్షం వచ్చినా తడవకుండా టెంట్లు, తదితర ఏర్పాట్లను చేపట్టారు. పశువైద్య, పశు సంవర్దక శాఖ, వైద్యారోగ్య శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, తదితర శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ ద్వారా ప్రదర్శన ఏర్పాటు చేయను న్నారు. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించిన ఆవిష్కర్తలకు ప్రశంస పత్రాలు అందించనున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శనకు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి  75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు.  వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజే శ్వర్‌రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం  10:30 గంటలకు కలెక్టరేట్‌ కార్యాల యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో  పాల్గొంటారు.  కలెక్టర్‌ భారతి హోళికేరి ఆధ్వర్యంలో  నిర్వహించే  వేడుకల్లో డీసీపీ అఖిల్‌ మహజన్‌, డీఎఫ్‌వో శివాణి డోంగ్రె, శాసన సభ్యుడు దివాకర్‌రావు, అన్ని శాఖల అధికారులు, మున్సిపల్‌ చైర్మన్‌, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లో సందడి నెలకొంది. దుకాణాల్లో త్రివర్ణ పతాకాలు, జాతీ య నాయకుల ఫొటోల అమ్మకాలు జోరుగా సాగాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పం చాయతీ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో జెండా పండుగకు ముస్తాబు చేస్తున్నారు.  

మందమర్రి టౌన్‌:  స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్లు ముస్తాబయ్యాయి. ఏరియాలోని కేకే  1, కేకే  5, కేకే ఓసీ, ఏరియా స్టోర్స్‌, వర్క్‌షాపు, సివిల్‌, హెల్త్‌ డిపార్టుమెంట్‌, రెస్క్యూ స్టేషన్‌లను జాతీయ జెండాలతో అలంకరించారు. ఉదయం  8 గంటలకు జెండాలను ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేశారు.   మందమర్రి ఏరియాలో  ఆయా గనుల, డిపార్ట్‌మెంట్‌ల నుంచి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారిని సోమవారం స్వాతంత్రం  దినోత్సవం సందర్భంగా జీఎం కార్యాలయంలో సన్మానించనున్నారు. జీఎం కార్యాలయాన్ని ముస్తాబు చేశారు. 


Updated Date - 2022-08-15T03:36:43+05:30 IST