కమలాపురం రూరల్, జనవరి 16: కమలాపురం దగ్గర పా పాఘ్ని నదిపై కూలిపోయిన వంతెనను ఆదివారం కాం గ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు ఎన్‌ఎ్‌సఈవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ తిరుమలేసు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వలన నీటి ఉధృతి అధికంగా రావడంతో పాపాఘ్ని నదిపై ఉన్న బ్రిడ్జీ కూలిపోయి రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. నెలలు గడుస్తున్నా ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.తాత్కాలిక రహదారిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టి రవాణా రాకపోకలకు తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు.