ఆ వీసీల నియామకం చెల్లదు!

ABN , First Publish Date - 2021-05-09T08:50:16+05:30 IST

యూనివర్సిటీ వైస్‌చాన్సెలర్‌(వీసీ) నియామకంలో ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారి నియామకాలు చెల్లవని పేర్కొంది. 2018 అక్టోబరు 25న కాకినాడ జేఎన్‌టీయూ వీసీ నియామకం కోసం

ఆ వీసీల నియామకం చెల్లదు!

జేఎన్‌టీయూకే, సింహపురి వర్సిటీల వీసీల నియామకంపై హైకోర్టు తీర్పు


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ వైస్‌చాన్సెలర్‌(వీసీ) నియామకంలో ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారి నియామకాలు చెల్లవని పేర్కొంది. 2018 అక్టోబరు 25న కాకినాడ జేఎన్‌టీయూ వీసీ నియామకం కోసం ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీలో యూనివర్సిటీలతో సంబంధం ఉన్న ఉన్నతవిద్యా శాఖ ప్రధానకార్యదర్శిని నియమించారు. అయితే.. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన సెర్చ్‌ కమిటీ ద్వారా చేపట్టిన వీసీల నియామకం చెల్లదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న వీసీ పదవి ఈ ఏడాది అక్టోబరు 24తో ముగియనుండగా, ప్రభుత్వం ఇప్పటికే కొత్త వీసీ నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేసింది. గతంలో మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంభించింది. గత ఏడాది నియమితులైన వీసీలు సైతం యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సిఫారసు మేరకు నియమించడంపై హైకోర్టులో పిల్‌దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ జరిపిన కోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. వాటి మేరకు కోర్టు తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టారు. అయితే, ప్రస్తుత తీర్పుతో వీసీల నియామకంపై ఉత్కంఠ నెలకొంది. 

Updated Date - 2021-05-09T08:50:16+05:30 IST