వార్షిక రుణ ప్రణాళిక రూ.1652.50 కోట్లు ఖరారు

ABN , First Publish Date - 2020-08-06T06:19:55+05:30 IST

వార్షిక రుణ ప్రణాళిక 2020-21 సంవత్సరానికి గాను రూ.1652.50 కోట్లుగా ఖరారు చేశామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

వార్షిక రుణ ప్రణాళిక రూ.1652.50 కోట్లు ఖరారు

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా


ఆసిఫాబాద్‌, ఆగస్టు5: వార్షిక రుణ ప్రణాళిక 2020-21 సంవత్సరానికి గాను రూ.1652.50 కోట్లుగా ఖరారు చేశామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇందులో పంట రుణాలు రూ.1138.51 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు (టర్మ్‌లోన్స్‌) రూ. 257.30 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.95.76 కోట్లు, ఎంఎస్‌ఎంఈ సెక్టారుకు రూ.70.43 కోట్లు, మొత్తం ప్రాదాన్యత రంగాలకు రూ.1562 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అప్రాధాన్యత రంగాలకు రూ.90.50 కోట్లు, కేటాయించామన్నారు. 


ఈ సంవత్సరానికి రూ.1138.51 కోట్లు పంట రుణాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 28,005 మంది రైతులకు రూ. 262.76 కోట్లు రెనివల్స్‌ చేశామన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకానికి రూ.8.65 కోట్లు అందించామన్నారు.   ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి రాంబాబు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ చెంచు రామయ్య, టీజీబీఏఓ రఘువెందర్‌రెడ్డి, నాబార్డు డీడీఎం వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా వ్యవసా యాధికారి రవిందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-06T06:19:55+05:30 IST