The American Dream:ప్రపంచంలోనే పొడవైన కారు.. దానిలో స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్‌ కూడా.. మీరూ ఓ లుక్కేయండి

ABN , First Publish Date - 2022-03-13T22:21:20+05:30 IST

ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. పిండి కొద్ది రొట్టే అన్న చందంగా వెచ్చించే డబ్బును బట్టీ సకల సౌకర్యాలతో కూడిన కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇటువంటి ఖరీదైన లగ్జరీ కార్లను ఇ

The American Dream:ప్రపంచంలోనే పొడవైన కారు.. దానిలో స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్‌ కూడా.. మీరూ ఓ లుక్కేయండి

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. పిండి కొద్ది రొట్టే అన్న చందంగా వెచ్చించే డబ్బును బట్టీ సకల సౌకర్యాలతో కూడిన కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇటువంటి ఖరీదైన లగ్జరీ కార్లను ఇప్పటికే ఎన్నో చూసే ఉంటారు కూడా. కానీ స్విమ్మింగ్ పూల్, గోల్ఫ్‌ కోర్స్, హెలిప్యాడ్ వంటి సౌకర్యాలు ఉన్న కారును మాత్రం చూసుండరు. ఏంటీ.. కారులో ఇవన్నీ ఎలా ఉంటాయ్? అని ఆశ్చర్యపోతున్నారా. నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం. ‘ది అమెరికన్ డ్రీమ్’ కారులో ఇవన్నీ ఉన్నాయి. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



‘ది అమెరికన్ డ్రీమ్’ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గతంలోనే గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. తాజాగా ఈ కారు పొడవు మరింత పెరగడంతో దాని రికార్డును అదే బద్ధలు కొట్టుకుంది. 1986లో కాలిఫోర్నియాకు చెందిన జాయ్ ఓర్‌బెర్గ్ అనే వ్యక్తి 60 అడుగుల పొడవుతో తొలుత ఈ కారును రూపొందించారు. దీంతో అప్పట్లో ఈ కారు క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. సినిమాలకు కోసం చిత్ర యూనిట్లు ఈ కారును బుక్ చేసుకునేవి. అయితే క్రమేణా ప్రజలకు దీనిపై మోజు తగ్గిపోయింది. దీంతో ఈ కారు శిథిలావస్థకు చేరింది. ఇటీవల ఇ-బేలో ‘ది అమెరికన్ డ్రీమ్’ అమ్మకానికి వచ్చింది. ఈ నేపథ్యంలో మైఖెల్ మ్యానింగ్ మరొకరి సహాయంతో కారును కొనుగోలు చేసి, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి మరీ కారుకు మరమ్మతులు చేయించారు. స్విమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్ కోర్స్, హెలిప్యాడ్‌ వంటి అనేక లగ్జరీ సదుపాలయతో కారును పునరుద్ధరించారు. ఇదే సమయంలో ‘ది అమెరికన్ డ్రీమ్’ పొడవు మరో 40 అడుగులు పెరిగి మరోమారు రికార్డుల్లోకి ఎక్కింది. ‘ది అమెరికన్ డ్రీమ్’కు సంబంధించిన ఫొటోలను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.






Updated Date - 2022-03-13T22:21:20+05:30 IST