రాజకీయ లబ్ధికోసమే ఆరోపణలు

ABN , First Publish Date - 2022-05-27T04:51:25+05:30 IST

వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ జనసేనపై ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

రాజకీయ లబ్ధికోసమే ఆరోపణలు
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నేత లింగారెడ్డి

 ప్రజలే తగిన బుద్ది చెబుతారు : టీడీపీ నేతలు 

కడప(ఎర్రముక్కపల్లి), మే 26: వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ జనసేనపై ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కడప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు,  రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,  గోవర్థన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదిర్శి వికా్‌సహరి విలేకరులతో మాట్లాడుతూ అంబేడ్కర్‌పై వైసీపీ ప్రభుత్వానికి అభిమానం ఉంటే ముందుగానే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టి ఉండేవారన్నారు. ప్రశాంత్‌కుమార్‌ సూచనల మేరకు జిల్లాకు అంబేడ్కర్‌ పేరుపెట్టారన్నారు. కోనసీమలో జరిగిన అల్లర్ల కు టీడీపీ, జనసేనను బాధ్యులుగా ప్రకటించడం అన్యాయమన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మహానాడును అడ్డుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. మహానాడు ఒక చరిత్ర అని దానిని అడ్డగించే  ప్రయత్నాలు చేస్తే ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని తెలిపారు. 

మహానాడు విజయవంతానికి కృషి  చేయాలి 

ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎదురు లేని పార్టీ టీడీపీ 

చెన్నూరు, మే 26: ఒంగోలు లో శుక్ర, శనివారాల్లో జరిగే మహానాడు విజయవంతాని కి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇందుకు పార్టీ శ్రేణులంతా తరలి రావాలని మండల టీడీపీ కన్వీనర్‌ కె.విజయభాస్కర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి జి.మల్లికార్జునరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే వైసీ పీ గుండెల్లో జట్‌ స్పీడ్‌తో రైళ్లు పరిగెడుతున్నాయని పార్టీ గతం కన్నా ఇప్పుడు ఎక్కువ విజయవమమవుతుందనే భయంతో పలు రకాల అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారు ఎలాంటి నీచపు పనులకు దిగినా మహానాడు విజయవం తమ వుతుందన్నారు. ఇటీవల జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాయలసీమ జిల్లా లో చేసిన పర్యటనలో వచ్చిన స్పందన, మద్ధతు భారీ స్థాయిలో విజయవంతమవడం తో జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైసీపీ జిమ్మిక్కుల్లో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర తుస్సుగాక తప్పదన్నారు. మార్కెట్‌ యా ర్డు మాజీ చైర్మన్‌ శివారెడ్డి, జిల్లా తెలుగుయువత కార్యదర్శి ఆకుల చలపతి, మండల మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్‌ హుస్సేన్‌, రెడ్డయ్యరెడ్డి, ఆటోబాబు, ముండ్లపల్లి అబ్దుల్లా, రాఘవయ్య, బాలకృష్ణారెడ్డి, కుందేటి కృష్ణయ్య, శ్రీనాఽథ్‌రెడ్డి, విజయకుమార్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-27T04:51:25+05:30 IST