ఐటీ పరిశ్రమను విస్తరింపజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-27T04:58:06+05:30 IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ పరిశ్రమను విస్తరింపజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఐటీ పరిశ్రమను విస్తరింపజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌


ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ 

ఎమ్మెల్యే జోగురామన్నకు పరామర్శ

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి)/ జైనథ్‌, : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ పరిశ్రమను విస్తరింపజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఎమ్మె ల్యే, మాజీ మంత్రి జోగురామన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. మొదట జైనథ్‌ మండలం దీపాయిగూడ గ్రామంలో ఎమ్మెల్యే జోగురామన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే తల్లి జోగుభోజమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుబూతి తెలిపారు. అనంతరం ఆదిలాబాద్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్‌టీటీబీడీఎన్‌టీ ఐటీ ల్యాబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వితీయ శ్రేణి నగరాల్లోను ఐటీ పరిశ్రమను విస్తరిస్తామన్నారు. ఆదిలాబాద్‌ లాంటి మారుమూల ప్రాంతంలోనూ ఐటీ కం పెనీని నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక్కప్పుడు ఆదిలాబాద్‌ అంటేనే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని ఇప్పుడు ఆదిలాబాద్‌ కూడా ఐటీ మ్యాప్‌లో నిలిచిందన్నారు. సీఎంప్రత్యేక చొరవతో వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఐటీ పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఐటీ హాబ్‌కు మరిన్ని వసతులు కల్పించేందుకు రూ.కోటీ 50లక్షల నిధులు వెంటనే మంజూరు చేయిస్తానన్నారు. మూతబడిన సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కశ్మీర్‌ ఆఫ్‌ తెలంగాణగా గుర్తించబడిందని, ఇక్కడ ఉన్న అద్భుత ప్రాంతాలు రాష్ట్రంలో మరెక్కడా లేవన్నారు. ఆదిలాబాద్‌లో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌ తదితర పట్టణాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు. 

స్వాగతం పలికిన నేతలు, అధికారులు

జైనథ్‌ : ఎమ్మెల్యే జోగురామన్నను పరామర్శించ డా నికి మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు సబితా ఇం ద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం జైనథ్‌కు వచ్చారు. వీరికి రాష్ట్ర మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యేలు రాథోడ్‌ బాపు రావు, ఆత్రంసక్కు, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎం పీపీ ఎం.గోవర్ధన్‌, జడ్పీటీసీ అరుంధతిరెడ్డి ఘన స్వా గతం పలికారు. మంత్రులు రాక సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి పోలీసు బందోబస్తు ఇతర ఏర్పాట్లపై కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో మాట్లా డారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులను మంత్రి కేటీఆర్‌ పరిచయం చేసుకున్నారు. 

Updated Date - 2022-09-27T04:58:06+05:30 IST