ప్రతీ ఆయకట్టుకు సాగునీరు అందించడమే సీఎం లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-21T05:58:27+05:30 IST

రాష్ట్రంలోని ప్రతీ ఆయకట్టుకు సాగు నీరందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

ప్రతీ ఆయకట్టుకు సాగునీరు అందించడమే సీఎం లక్ష్యం
పిల్లాయిపల్లి కాల్వ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి

 ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్‌పల్లి, జూన్‌ 20 :
రాష్ట్రంలోని ప్రతీ ఆయకట్టుకు సాగు నీరందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గానికి సాగు నీరందించే పిల్లాయిపల్లి కాల్వ నిర్మాణ పనులను ఐబీ అధికారులతో కలిసి చౌటుప్పల్‌, పోచంపల్లి మండలాల్లో ఆదివారం పరిశీలించారు. జలాల్‌పూర్‌ గ్రామం నుంచి 17కి.మీ నుండి ఎస్‌లింగోటం 42కి.మీల వరకు గ ల కాల్వ పనులను పరిశీలించారు. పిల్లాయిపల్లి కాల్వ పూర్తయితే 60వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. రూ.55కోట్ల మేరకు పనులు జరిగాయని మరో రూ.40కోట్ల అంచనా మేర చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పనులు వేగంగా  పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. బీ.వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును సైతం సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి సహకారంతో త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు.
చిట్యాల : పిలాయిపల్లి కాల్వను ఏడాదిలోపు పూర్తిచేసి  నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరందిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం ఆయన పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ గ్రామం నుంచి చౌటుప్పల్‌ మండలంలోని ఎస్‌లింగో టం వరకు చేపడుతున్న పిలాయిపల్లి కాల్వ  పనులు పరిశీలించి మాట్లాడారు. ఎన్నారై వాసవి అసోసియేషన అందించిన నిత్యావసర వస్తువులు, ఆక్సిమీటర్లను ఎమ్మెల్యే లింగ య్య కౌన్సిలర్‌ పందిరి గీతతో కలిసి పీహెచసీ సిబ్బందికి  అంది ంచారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్‌ బెల్లి సత్తయ్య, మెండె సైదులు, వైద్యాధికారి కిరణ్‌, ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.
ఫ చిట్యాలలో నిర్మించిన రైతు వేదికను మంత్రి జగదీ్‌షరెడ్డి,  ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ప్రారంభిస్తారని మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
కేతేపల్లి : పేదలు ముఖ్యమంత్రి ససహాయనిధిని సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. మం డలంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన మెరుగుమళ్ల లింగమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఎమ్మెల్యే లింగయ్యను ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మె ల్యే నిమ్స్‌ ఆస్పత్రిలో లింగమ్మను చేర్పించారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా లింగమ్మ ఆరోగ్య పరిస్థితిని వివరించి రూ.1.50లక్షలు మంజూరు చేయించారు. ఈ మేరకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును లింగమ్మ కుటుంబసభ్యులకు అందించారు.

Updated Date - 2021-06-21T05:58:27+05:30 IST