ధరణి ఫిర్యాదుల సత్వర పరిష్కారమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-06-22T05:00:15+05:30 IST

ధరణి పోర్టల్‌లో వివిధ కేటగిరీల భూ సంబంధిత పెండింగ్‌ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి నాలుగురోజుల్లో పూర్తిచేయాలని, ధరణి కోసం ప్రత్యేకించి కేటాయించిన సెక్షన్‌ తహసీల్దార్లు, సిబ్బందికి కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి దిశానిర్దేశం చేశారు.

ధరణి ఫిర్యాదుల సత్వర పరిష్కారమే ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి

కొండపాక, జూన్‌ 21 : ధరణి పోర్టల్‌లో వివిధ కేటగిరీల భూ సంబంధిత పెండింగ్‌ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి నాలుగురోజుల్లో పూర్తిచేయాలని, ధరణి కోసం ప్రత్యేకించి కేటాయించిన సెక్షన్‌ తహసీల్దార్లు, సిబ్బందికి కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ కలెక్టర్‌ సమావేశ మందిరంలో ధరణి సెక్షన్‌ బాధ్యులతో పెండింగ్‌ అర్జీలు, పరిష్కార ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఇందులో సిద్దిపేట జిల్లాలో ధరణికి సంబంధించి భూ సమస్యలు, ఫిర్యాదులు, ప్రోహిబిటెడ్‌ ప్రాపర్టీస్‌, మ్యుటేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్థితిగతులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ట్విటర్‌లో వచ్చిన సమస్యలపై ఆరాతీసి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగురోజుల్లోగా ధరణి పోర్టల్‌లో భూ సంబంధిత వివిధ కేటగిరీల పెండింగ్‌ దరఖాస్తులన్నింటినీ క్లియర్‌ చేద్దామని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ధరణి సెక్షన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధరణి సెక్షన్‌ బాధ్యులతో పెండింగ్‌ అర్జీలు, పరిష్కార ప్రగతిపై చర్చించి తిరిగి మంగళవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్వో బి.చెన్నయ్య, తహసీల్దార్‌ యాదగిరి, పద్మాకర్‌, సయ్యద్‌ఆసీఫ్‌, ధరణి టెక్నికల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:00:15+05:30 IST