జిల్లాలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-03-07T05:46:17+05:30 IST

కుష్టు, క్షయ వ్యాధి గ్రస్థు లకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని జిల్లా వైద్యాధికారి కుంరంబాలు అన్నారు.

జిల్లాలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
వాహనంలో టెస్టు పరికరాలను ప్రారంభిస్తున్న అధికారులు

  - జిల్లా వైద్యాధికారి కుంరం బాలు

బెజ్జూరు, మార్చి 6: కుష్టు, క్షయ వ్యాధి గ్రస్థు లకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని జిల్లా వైద్యాధికారి కుంరంబాలు అన్నారు. శనివారం మండలంలోని కుశ్నపల్లి గ్రామంలో లెఫ్రసి సొసైటీ ఆధ్వర్యంలో సంచార మొబైల్‌ పరీక్షకిట్ల వాహనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటగా బెజ్జూరు మండలంలో సంచారపరీక్ష కిట్ల వాహ నాన్ని ప్రారంభించామని దీని ద్వారా మొదటగా కరోనా,క్షయ,కుష్టువ్యాధిగ్రస్థులకు పరీక్షలు నిర్వ హించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నా మని తెలిపారు. విడతల వారీగా జిల్లా మొత్తం పరీక్షలను చేస్తామన్నారు. అనంతరం సొసైటి సీఈవో ప్రశాంత్‌ నాయక్‌ మాట్లాడుతూ కెనడాలోని ఎఫెక్ట్‌ హోప్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొ న్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌(బీపిహెచ్‌ఆర్‌సి) డాక్టర్‌ అపర్ణ, ప్రోగ్రాం హెడ్‌ అరుణ్‌, కోఆర్డినేటర్‌ రామానుజాచారి, మెడికల్‌ అధికారి డాక్టర్‌ మైకెల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-07T05:46:17+05:30 IST