‘స్వచ్ఛ పెద్దపల్లి’గా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-04-17T06:08:17+05:30 IST

పెద్దపల్లి పట్టణాన్ని చెత్త రహిత స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

‘స్వచ్ఛ పెద్దపల్లి’గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ట్రాలీ ఆటోలను జెండాఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 16: పెద్దపల్లి పట్టణాన్ని చెత్త రహిత స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇంటింటా తడి చెత్త, పొడి చెత్తను సేకరించేందుకు పట్టణ ప్రగతి నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు 45 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన 4 ట్రాలీ ఆటోలను మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ మమతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచనల మేరకు పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్ట ణంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరో గ్యంగా ఉంటారన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేసేందుకు ఇంటింటికి పంపిణీ చేసిన బుట్టలను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త వేయవద్దని, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్‌ నాజిమిన్‌ సుల్తానా, మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ తిరుపతి, కౌన్సిలర్లు, కోఆప్ష న్లు, ఏఈలు సతీష్‌, మనోహర్‌, శానిటరీఇన్‌స్పెక్టర్లు రామ్మో హన్‌రెడ్డి, పులిపాక రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T06:08:17+05:30 IST