Abn logo
Oct 2 2020 @ 03:46AM

వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి

అమలాపురం టౌన్‌, అక్టోబరు 1: కార్పొరేట్లకు అనుకూలమైన రైతాంగ సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో అమలాపురం ఏఐటీయూసీ కార్యాలయం వద్ద గురువారం నిరసన దీక్ష చేపట్టారు. సీపీఐ, సీపీఎం, రైతుసంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో రైతు సంఘ జిల్లా కోఆర్డినేటర్‌ కె.సత్తిబాబు, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి కారెం వెంకట్వేరరావు, కేవీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పచ్చిమాల వసంతకుమార్‌లు మాట్లాడారు. దీక్షలో పితాని ఆనందరావు, సానబోయిన మరిడి, సానబోయిన శ్రీనివాసరావు, మట్టపర్తి నారాయణ, సరెళ్ల చంటి, గణేష్‌, బి.శ్రీను  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement