గిట్టుబాటు ధర కోసమే వ్యవసాయ బిల్లు : బీజేపీ

ABN , First Publish Date - 2020-09-23T06:02:26+05:30 IST

దేశ రైతాంగానికి పంట గిట్టుబా టు ధర కల్పించేందుకే కేంద్రం రైతు ఉత్పత్తుల వాణిజ్య వర్తక బిల్లును తీసుకొచ్చిందని బీజేపీ

గిట్టుబాటు ధర కోసమే వ్యవసాయ బిల్లు : బీజేపీ

నర్సంపేటలో వ్యవసాయ బిల్లుకు మద్దతుగా ర్యాలీ 

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం


నర్సంపేట టౌన్‌, సెప్టెంబరు 22 : దేశ రైతాంగానికి పంట గిట్టుబా టు ధర కల్పించేందుకే కేంద్రం రైతు ఉత్పత్తుల వాణిజ్య వర్తక బిల్లును తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం బిల్లుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నర్సంపేటలో మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వ హించారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరా భిషేకం చేశారు. 


అనంతరం రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకా శ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు నిర్బంధ వ్యవసాయ విధానం అమ లు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేంద్రం ప్రవేశపెట్టిన రైతు సాధికారిత బి ల్లును వ్యతిరేకించే నైతిక హక్కు లేదన్నారు. అసలు బిల్లు ముసాయి దాను కేసీఆర్‌ చదివారా అని ప్రశ్నించారు. ప్రపంచంలో బలమైన దేశం గా భారత్‌ అభివృద్ధి చెందాలంటే ముందుగా రైతు ఆర్థికంగా బలపడా లనే లక్ష్యంతో బిల్లును తీసుకొచ్చిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, తన పంటకు తానే ధర నిర్ణయించుకోవడానికి ఈ బిల్లు తోడ్పడుతుందన్నారు. రైతు ల్లో భయానక వాతావరణాన్ని సృష్టిం చడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు చూడ టం దుర్మార్గమైన చర్యఅని అన్నారు. 


జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ బిల్లులు వ్యతిరేకి స్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేయడం సరైంది  కాద న్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డెపల్లి నర్సింహరాములు, రేసు శ్రీని వాస్‌, మద్దికాయల రాంబాబు, బాల్నె జగన్‌, జాటోతు సంతోష్‌నాయక్‌, మ ల్యాల వినయ్‌ తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - 2020-09-23T06:02:26+05:30 IST