వృద్ధాప్య పెన్షన్ కనీసం పదివేలు ఉండాలి

ABN , First Publish Date - 2020-03-05T08:37:47+05:30 IST

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడగకుండానే ఆటోవాళ్లకు పదివేలు ఇచ్చాడు. అదేవిధంగా ముసలివాళ్ళకిచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా నెలకు పదివేలు ఇవ్వవలసిన అవసరం ఉంది...

వృద్ధాప్య పెన్షన్ కనీసం పదివేలు ఉండాలి

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడగకుండానే ఆటోవాళ్లకు పదివేలు ఇచ్చాడు. అదేవిధంగా ముసలివాళ్ళకిచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా నెలకు పదివేలు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఏవిధమైన ఆధారంలేని వాళ్ళేకదా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నది. ముసలి వృద్ధదంపతులకు ఈరోజుల్లో పదివేలు లేనిదే కాపురం గడవదు. ఉల్లిపాయలు కేజీ వంద, కూరగాయలు కేజీ 50 ....60 రూపాయల కనీసం పలుకుతున్నాయి.  రిటైర్ అయిన ఉద్యోగులు నెలకు 30 వేలనుండి 70 ....80 వేల దాకా పొందుతున్నారు. ఐదు సంవత్సరాలు అన్ని సౌకర్యాలు పొంది నెలకు లక్షల్లో జీతం తీసుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా భారీమొత్తంలో పెన్షన్ ఇస్తున్నారు కదా! ముసలివాళ్ళకి నెలకు పదివేలు పెన్షన్ ఇచ్చినందు వల్లల  ప్రభుత్వానికి వచ్చే నష్టం ఎమీలేదు. వృద్ధులను ఆదుకోవడం నాగరిక సమాజ లక్షణం. 

నార్నె వెంకట సుబ్బయ్య


Updated Date - 2020-03-05T08:37:47+05:30 IST