చిట్వేలితో అనుబంధం విడదీయరానిది

ABN , First Publish Date - 2022-06-27T04:48:38+05:30 IST

చిట్వేలితో నాకున్న అనుబంధం విడదీయరానిదని, ఉద్యోగ రిత్యా తండ్రి చిట్వేలికి రావడమే ఇందుకు కారణమని ఐఏఎస్‌ 62వ ర్యాంకర్‌ శ్రీపూజిత మధుర స్ముృతులను గుర్తు చేసుకున్నారు.

చిట్వేలితో అనుబంధం విడదీయరానిది
ఆత్మీయ సభలో మాట్లాడుతున్న శ్రీపూజిత

ఆత్మీయసభలో ఐఏఎస్‌ 62వ ర్యాంకర్‌ శ్రీపూజిత

చిట్వేలి, జూన్‌ 26: చిట్వేలితో నాకున్న అనుబంధం విడదీయరానిదని, ఉద్యోగ రిత్యా తండ్రి చిట్వేలికి రావడమే ఇందుకు కారణమని ఐఏఎస్‌ 62వ ర్యాంకర్‌ శ్రీపూజిత మధుర స్ముృతులను గుర్తు చేసుకున్నారు. ఆదివారం శివాలయంలో ప్రజలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు తల్లిదండ్రులతో హాజరైన ఆమె మాట్లాడుతూ చిట్వేలిలో పుట్టి నాలుగో తరగతి వరకు చదివినట్లు పేర్కొన్నారు. తండ్రి వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా చిట్వేలిలో పనిచేయడంతో ఈ అనుబంధం ఏర్పడిందన్నా రు.

విద్యాబుద్దులు చెప్పిన ఉపాధ్యాయులు విశ్వనాధంబాబు, రాజా, జయచంద్ర, ఎన్‌.ప్రసాద్‌, నరసరామయ్యకు పాదాభివందనం చేసి గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శ్రీపూజితను పలువురు శాలువాతో సత్కరించి మెమొంటోలు బహుకరించారు.  శ్రీపూజిత తల్లిదండ్రులను స్థానికులు శాలువాతో సత్కరించారు. తన విజయంలో స్ఫూర్తిగా నిలిచిన తల్లిదండ్రులకు శ్రీపూజిత పాదాభివందనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎల్‌.వి.మోహన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, డాక్టర్‌ చంద్రశేఖర్‌, బీజేపీ నేతలు సుబ్బరాయుడు, వెంకటరెడ్డి, మానవతా సభ్యులు మునిరావు, సీహెచ్‌ఎ్‌స కార్యదర్శి ఇంతియాజ్‌ అహమ్మద్‌, ఉపాధ్యాయులు ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T04:48:38+05:30 IST