‘అల’కల్లోలం!

ABN , First Publish Date - 2021-07-24T05:34:48+05:30 IST

ముక్కాం తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. అయితే శుక్రవారం ఉదయం నాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసి పడుతుండడంతో తీరంలో ఉన్న పడవలు, వలలు, వేట సామగ్రిని మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

‘అల’కల్లోలం!




ముక్కాంలో ముందుకొచ్చిన సముద్రం

భోగాపురం, జూలై 23: ముక్కాం తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. అయితే శుక్రవారం ఉదయం నాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసి పడుతుండడంతో తీరంలో ఉన్న పడవలు, వలలు, వేట సామగ్రిని మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Updated Date - 2021-07-24T05:34:48+05:30 IST