జాప్యం కోసమే పరిపాలనా సంస్కరణల కమిటీ

ABN , First Publish Date - 2022-01-20T06:17:33+05:30 IST

ఉద్యోగాల భర్తీలో మరింత జాప్యం చేసేందుకే పరిపాలన సంస్కరణల కమిటీ పేరిట ప్రయత్నిస్తోందని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్లు, ఉద్యోగ ఖాళీల భర్తీ చేయాలని, 317 జీవో రద్దు చేయాలని కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరిలోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహిం చిన

జాప్యం కోసమే పరిపాలనా సంస్కరణల కమిటీ
వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భువనగిరి టౌన్‌, జనవరి 19: ఉద్యోగాల భర్తీలో మరింత జాప్యం చేసేందుకే పరిపాలన సంస్కరణల కమిటీ పేరిట ప్రయత్నిస్తోందని మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్లు, ఉద్యోగ ఖాళీల భర్తీ  చేయాలని, 317 జీవో రద్దు చేయాలని కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరిలోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహిం చిన ధర్నాలో మాట్లాడారు. ఉద్యోగాలు భర్దా చేయకపోగా నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోం దన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరిగేదన్నారు. ఉద్యోగులకు అటంకంగా మారిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల నాయ కులు ఈరపాక నర్సింహ, పడిగెల ప్రదీప్‌, ముత్యాల మనోజ్‌కుమార్‌, కొల్లూరు రాజు, సిరిపంగ చందు, దర్గాయి దేవేందర్‌, మాటూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:17:33+05:30 IST