Advertisement
Advertisement
Abn logo
Advertisement

32 ఏళ్ల మాజీ ప్రేయసి పక్కా స్కెచ్.. ప్రియుడి భార్య ఫొటోలను సంపాదించి ఎంత నీచానికి పాల్పడిందో తెలిస్తే..

ప్రేమ పేరుతో దగ్గరయ్యే యువతీయువకులు.. కొన్నాళ్లకు వివిధ కారణాలతో విడిపోతూ ఉంటారు. కొందరు మాత్రం మర్చిపోలేక జీవితాంతం కుమిలిపోతుంటారు. తన ప్రేయసి బాగుండాలని కొందరు.. ప్రేమను కూడా త్యాగం చేస్తుంటారు. కొందరు అమ్మాయిలు.. అదే బాధలో గడుపుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మనం చెప్పుకోబోయే యువతి మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా చేసింది. తిరువనంతపురంలో ఓ జంట విడిపోయింది. అయితే తర్వాత ప్రియుడికి వివాహమైంది. కానీ మాజీ ప్రేయసి మాత్రం మర్చిపోలేదు. ప్రియుడి భార్యపై పగ తీర్చుకోవాలనుకుంది.. వివరాల్లోకి వెళితే..

తిరువనంతపురానికి చెందిన సౌమ్య అనే 32 ఏళ్ల యువతి, ఓ యువకుడు కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇటీవల ప్రియుడికి వేరే యువతితో వివాహమైంది. దీన్ని జీర్ణించుకోలేని సౌమ్య.. ఎలాగైనా ప్రియుడి భార్యపై పగ తీర్చుకోవాలని కుట్ర పన్నింది. ఆమె ఫొటోలను సేకరించింది. వాటిని మార్ఫింగ్ చేసి, తద్వారా ఆమె పరువు తీయాలని భావించింది. ఫేక్ ఐడీలను క్రియేట్ చేసేందుకు.. సోషల్ మీడియాలో కొంతమంది యువకులతో హనీట్రాప్ తరహా వ్యవహారం నడిపి.. పరిచయం పెంచుకుంది. వారి సాయంతో సుమారు వందకు పైగా నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం అకౌంట్లను క్రియేట్ చేసింది.

తన మాజీ ప్రియుడి భార్య ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, అందులో పోస్టు చేయడం ప్రారభించింది. కొన్నాళ్లకు అవి వైరల్ అవడంతో బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో సౌమ్య బండారం బయటపడింది. దీంతో సౌమ్య, ఆమెకు సహరించిన యువకులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement