Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలకు క్షమాపణ చెప్పిన తాటికొండ రాజయ్య

వరంగల్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మహిళలకు క్షమాపణ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం బతుకమ్మ చీరల పంపిణీలో రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మాటలు మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉంటే క్షమించాలని రాజయ్య వేడుకున్నారు. రాజయ్య వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  కథనాలు ప్రసారం చేసింది.


ఎమ్మెల్యే టి.రాజయ్య మాట జారిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని నేను ఎందుకు అంటున్నానంటే కాన్పు అయిన తల్లికి కొత్తబట్టలు అయ్యవ్వలు తెత్తలేరు.. మొగడు తీసుకొస్తలేరు.. అత్తమామలు తీసుకొస్తలేరు.. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అయితున్నాడు.. అమ్మా, అయ్యా కేసీఆరే అయితుండు.. భర్త కూడా అయినే అయిపోయి ఇయ్యాల మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు’ అని అన్నారు. ఆయన మాట జారిన తీరు వివాదాస్పదంగా మారింది. అయితే ఎమ్మెల్యే మట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జారిన ఆ మాట చర్చకు దారితీసింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement