స్వచ్ఛ ఊరంటే అది!

ABN , First Publish Date - 2022-07-05T08:21:37+05:30 IST

స్వచ్ఛ ఊరంటే అది!

స్వచ్ఛ ఊరంటే అది!

చేతిలో వాటర్‌ బాటిల్‌ ఖాళీ అయితే రోడ్డుపై పడేస్తాం. చిప్స్‌ తింటాం ప్యాకెట్‌ను ఎక్కడ పడితే అక్కడ వేస్తాం.. కానీ జపాన్‌లోని కామికాట్సు అనే చిన్న పట్టణంలో అడుగుపెడితే రోడ్డుపై ఎక్కడ కాగితం ముక్క కూడా కనిపించదు. ప్లాస్టిక్‌ బాటిళ్లు కనిపించవు. ఊరు వాళ్లందరూ ఆ నిర్ణయాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తారు. 


కామికాట్సు పట్టణంలో రీసైక్లింగ్‌ సెంటర్‌ ఉంది. బాటిల్స్‌, పేపర్లు, చెత్త... ఏదైనా రీసైక్లింగ్‌ సెంటర్‌కు వెళ్లి వేయాల్సిందే. ఆ ఊరు వాళ్లు తీసుకున్న నిర్ణయం అది. 

రీసైక్లింగ్‌ సెంటర్‌లో డస్ట్‌బిన్‌లుంటాయి. న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్లు, మెటల్‌క్యాపులు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌, బల్బులు, క్యాన్‌లు...ఇలా రకరకాల వస్తువులు వేయడానికి రకరకాల డస్ట్‌బిన్‌లుంటాయి. ఆయా డస్ట్‌బిన్లలో చెత్తను వేయాల్సి ఉంటుంది. రీసైక్లింగ్‌ సెంటర్‌లోని సిబ్బంది సైతం చెత్తను వేరుచేసే పనిచేస్తుంటారు.

రోజూ ఉదయం ఇక్కడ ఇంటి ముందు చెత్త బండి వస్తుంది. కానీ అక్కడ వాళ్లకు ఏ బండీ రాదు. వాళ్లే స్వయంగా చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్‌ సెంటర్‌లో వేసి వస్తుంటారు.

Updated Date - 2022-07-05T08:21:37+05:30 IST