ఆ చెట్టు పక్షులను చంపేస్తుంది!

ABN , First Publish Date - 2021-03-06T05:36:38+05:30 IST

చెట్లు పక్షులకు ఆవాసాన్ని ఇస్తాయి. గూడు కట్టుకుంటే నీడనిస్తాయి. కానీ ఒక చెట్టు మాత్రం పక్షులను చంపేస్తుంది. ఆ చెట్టుపై వాలిన పక్షి పైకి ఎగరలేక గిలాగిలా కొట్టుకుని చనిపోతుంది. ఇంతకీ ఆ చెట్టు పక్షులను ఎందుకు చంపుతుంది

ఆ చెట్టు పక్షులను చంపేస్తుంది!

చెట్లు పక్షులకు ఆవాసాన్ని ఇస్తాయి. గూడు కట్టుకుంటే నీడనిస్తాయి. కానీ ఒక చెట్టు మాత్రం పక్షులను చంపేస్తుంది. ఆ చెట్టుపై వాలిన పక్షి పైకి ఎగరలేక గిలాగిలా కొట్టుకుని చనిపోతుంది. ఇంతకీ ఆ చెట్టు పక్షులను ఎందుకు చంపుతుంది? ఎలా చంపుతుంది? 


పిసోనియా అనే చెట్టు కరేబియన్‌ దీవుల్లో, ఇండో-పసిఫిక్‌ దీవుల్లో పెరుగుతుంది. ఈ చెట్టుకు బర్డ్‌ క్యాచర్స్‌ అని పేరుంది. ఈ చెట్టు గింజలు జిగటగా ఉంటాయి. ఒకరకమైన జిగురులాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి.  పక్షులు ఆ చెట్టుపై వాలినప్పుడు, వాటి రెక్కలకు గింజలు అతుక్కుంటాయి. ఒకసారి అతుక్కుంటే ఇక ఆ గింజలను పక్షులు వదిలించుకోలేవు. దానివల్ల పక్షులు ఎగరలేకపోతాయి. అక్కడే చెట్టు కిందే పడి చనిపోతుంటాయి.  ఈ చెట్ల మూలంగా చాలా పక్షులు చనిపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ చెట్టు ఏడాదికి రెండు సార్లు పుష్పిస్తాయి. ఆ చెట్లను ఆవాసంగా చేసుకోవడానికి పక్షులు చేరతాయి. ఆ తరువాత ఎగరలేక అక్కడే చనిపోతాయి.

Updated Date - 2021-03-06T05:36:38+05:30 IST