వారిద్దరే కారణం!

ABN , First Publish Date - 2021-01-24T06:01:06+05:30 IST

పైస్థాయి ఉద్యోగుల మంద లింపులతో మనస్తాపం చెంది కారు షోరూములో డ్రైవరుగా పనిచేస్తున్న దానమయ్య శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు.

వారిద్దరే కారణం!

  1. సెల్ఫీ వీడియో తీసుకుని డ్రైవర్‌ ఆత్మహత్య


కర్నూలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పైస్థాయి ఉద్యోగుల మంద లింపులతో మనస్తాపం చెంది కారు షోరూములో డ్రైవరుగా పనిచేస్తున్న దానమయ్య శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు మం డలం మునగాలపాడు గ్రామానికి చెందిన దానమయ్య అనారోగ్యంతో నెల నుంచి విధులకు సరిగా హాజరుకాలేదు. దీని మీద  పైస్థాయి ఉద్యోగులు మందలించారు. దీంతో కలత చెంది తన ఆత్మహత్యకు పై స్థాయి ఉద్యోగులైన గంగాధర్‌, అరుణ్‌కుమార్‌ కారణమని సెల్ఫీ వీడియో తీసు కొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  తాలుకా సీఐ విక్రమ సింహ బాధితుడి సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-24T06:01:06+05:30 IST